Job Mela | నేడు ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా
Job Mela | అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ(మార్చి 31) జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఓయూ ఎంప్లాయిమెంట్ బ్యూరో ప్రకటించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఓయూ క్యాంపస్‌లో జాబ్ మేళా ప్రారంభం కానుంది.

ఓయూ ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మెడ్ ప్లస్ గ్రూపు ఈ జాబ్ మేళాను నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళాలో మొత్తం 100 ఫార్మాసిస్ట్, అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ అవకాశాన్ని ఫార్మసీ రంగంలో డిప్లొమా, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవచ్చు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. 18 నుంచి 30 ఏండ్ల వయసున్న వారు మాత్రమే జాబ్ మేళాకు అర్హులని పేర్కొన్నారు.
జీతం వచ్చే ఫార్మసిస్ట్‌కు నెలకు రూ. 19 వేల చొప్పున, అసిస్టెంట్‌కు నెలకు రూ. 12,756 చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు 9666662481 ఈ నంబర్‌ను సంప్రదించొచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram