Journalist Revathi case : రేవతి, తన్వి యాదవ్ అరెస్టు కేసులో అప్డేట్ !
ఒక పొలిటికల్ పార్టీతో కుమ్మక్కై పల్స్ యూ ట్యూబ్ చానెల్ ద్వారా బాధ్యత రహితంగా వీడియోలు పోస్ట్ చేస్తున్న వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేసిన జర్నలిస్టులు పల్స్ చానల్ సీఈఓ రేవతి, తన్వి యాదవ్ లకు నాంపల్లి కోర్టు ఈనెల 26వరకు 14 రోజుల రిమాండ్ విధించింది.

Journalist Revathi case : ఒక పొలిటికల్ పార్టీతో కుమ్మక్కై పల్స్ యూ ట్యూబ్ చానెల్ ద్వారా బాధ్యత రహితంగా వీడియోలు పోస్ట్ చేస్తున్న వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేసిన జర్నలిస్టులు పల్స్ చానల్ సీఈఓ రేవతి, తన్వి యాదవ్ లకు నాంపల్లి కోర్టు ఈనెల 26వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్ అడిషనల్ సీపీ విశ్వ ప్రసాద్ మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ప్రభుత్వ పథకాలను కించే పరిచే విధంగా పల్స్ యూట్యూబ్ చానెల్ వీడియోలు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి ఈ వీడియోలు తీసినట్టు మా దర్యాప్తు లో తేలిందన్నారు. అమాయకులు, వృద్దులతో కావాలని సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వీడియోలు చేపించి సీఎంను తిట్టించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఫండింగ్ తీసుకుని పల్స్ యూట్యూబ్ చానెల్ ఈ వీడియోలు తీసిందని, పల్స్ టీవికి బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక సహాయం ఇస్తున్నట్టు మా దర్యాప్తు లో తేలిందని సీసీ తెలిపారు.
సీఎంపై దుర్భాషలాడుతూ తీసిన వీడియోను ఫిబ్రవరిలో రికార్డు చేసి, కావాలని అసెంబ్లీ సెషన్ ముందు రిలీజ్ చేశారని, నిప్పుకోడి అనే సోషల్ మీడియా చానెల్ నుండి ఈ వీడియో బయటికి వచ్చిందని వివరించారు. తన్వి యాదవ్ ఇన్ స్ట్రాగ్రామ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా వీడియోలు ఉన్నాయని గుర్తించామన్నారు. రేవతి మీద గతంలోనూ కొన్ని కేస్ లు ఉన్నాయని, ఈ కేసులో పల్స్ చానల్ సీఈఓ రేవతి, తన్వి యాదవ్ ను అరెస్ట్ చేసి రెండు ల్యాప్ టాప్ లు, రెండు హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామన్నారు. నిందితులిద్ధరినీ కోర్టులో హాజరుపరిచామని, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు. దీంతో రేవతి, తన్వి యాదవ్‌లను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించామని సీపీ తెలిపారు.