ప్ర‌తి పేజీలో ఘోష్ చెర‌గ‌ని ముద్ర‌- కాళేశ్వ‌రం నివేదిక‌లో ఇదో హైలెట్

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జ రిగింద‌ని ఆరోపిస్తూ ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ క‌మిష‌న్ 665 పేజీల నివేదిక‌ను క‌మిష‌న్ చైర్మ‌న్ పీసీఘోష్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించిన విష‌యం అంద‌రికి తెలిసిందే

ప్ర‌తి పేజీలో ఘోష్ చెర‌గ‌ని ముద్ర‌- కాళేశ్వ‌రం నివేదిక‌లో ఇదో హైలెట్

విధాత‌: కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జ రిగింద‌ని ఆరోపిస్తూ ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ క‌మిష‌న్ 665 పేజీల నివేదిక‌ను క‌మిష‌న్ చైర్మ‌న్ పీసీఘోష్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించిన విష‌యం అంద‌రికి తెలిసిందే. క‌మిష‌న్ త‌న నివేదిక‌ను ప్ర‌భుత్వానికి నివేదించిన త‌రువాత ఎలాంటి మార్పులు, చేర్పులు చేసి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వాడు కోవ‌డానికి ఎలాంటి అవ‌కాశం లేకుండా అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఈ మేర‌కు ఘోష్ 665 పేజీల‌తో పూర్తి స్థాయి నివేదిక త‌యారు చేసి, ప్ర‌తిపేజీపై సంత‌కం చేశారు. అది కూడా ఏక్క‌డైతే పేజీ పూర్తి అవుతుందో అక్క‌డ ఏమాత్రం మ‌రొక లైన్ కూడా చేర్చ‌డానికి వీలులేకుండా సంత‌కం పెట్టారు. ఓపిక‌తో665 పేజీల‌కు సంత‌కం చేసిన తీరుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా క‌మిష‌న్‌లో ఏ పేజీలో కూడా ఎలాంటి చేర్పులు, మార్పులు చేయ‌డానికి అవ‌కాశం లేకుండా ఉంద‌ని నివేదిక‌ను చూసిన వాళ్లు అంటున్నారు.