గజదొంగకు ముగ్గురు స్టువర్టుపురం దొంగల తోడు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజయ్యకు తోడుగా ముగ్గురు స్టువర్టుపురం దొంగలుగా వచ్చారని ఆరోపిస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
విధాత, ప్రత్యేక ప్రతినిధి: గజదొంగకు తోడుగా తమ నియోజకవర్గానికి ముగ్గరు స్టువర్టుపురం దొంగలొచ్చారని బీఆర్ఎస్ నాయకులనుద్దేశించి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శనివారం కొందరు బీఆర్ఎస్ నాయకులు స్టేషన్ ఘన్ పూర్ వచ్చి నా పై అవాకులు చెవాకులు పేలారని కడియం అన్నారు. గజదొంగ రాజయ్యకు తోడుగా నియోజకవర్గ ఇంచార్జ్ ల పేరుతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డిలు స్టువర్టుపురం దొంగల్లా వచ్చారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా నలుగురిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి చెవిటోడు…. సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. తనకు సిగ్గులేదంటున్నాడు. వాస్తవానికి తన మనువరాలు వయసు ఉన్న అమ్మాయి చేతిలో ఓడిపోయేసరికి ఎర్రబెల్లికి చిన్న మెదడు చితికిపోయిందన్నారు. దీనికి సిగ్గుపడాల్సింది దయాకర్ అంటూ టీడీపీని హోల్ సేల్ గా అమ్మిన నీచ చరిత్ర ఎర్రబెల్లిదని విమర్శించారు. ఎర్రబెల్లి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే రేవంత్ అడ్డుకున్నారని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ చుట్టూ బొచ్చు కుక్కలా తిరిగి వేల కోట్ల ఆస్తులు సంపాదించాడని విమర్శించారు. ఇక కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టి నాశనం చేశారంటూ ఆరోపించారు. అసలు ఆ పొట్టోడు పొచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్, సంతోష్ రావుల బినామీ అంటూ విమర్శించారు. కేటీఆర్, సంతోష్ రావు సంపాదించిన డబ్బులని ఈయన ద్వారా రియల్ ఎస్టేట్లో ఖర్చు పెడుతున్నారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు బీఆర్ఎస్ టికెట్ రాకుండా చేసింది కూడా ఈ ముగ్గురేనని అన్నారు. ఈ సారి కూడా రాజయ్యకు చెక్పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఒకరు బీజేపీ నాయకున్ని, మరొకరు కాంగ్రెస్ నాయకున్ని, మరొకరు ఆర్ఎస్ ప్రవీణ్ ను తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని కడియం కోరారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
HYD to BNG – NH-44 | రూపుమారిన హైదరాబాద్-బెంగళూరు హైవే – గ్రీన్ఫీల్డ్ నుండి యాక్సెస్ కంట్రోల్డ్ : 5 గంటలే ప్రయాణం
Padma Shri Awards : పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..45మందిలో తెలంగాణ వాసి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram