Banoth Madanlal | వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మ‌ద‌న్‌లాల్ క‌న్నుమూత‌

Banoth Madanlal | వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మ‌ద‌న్‌లాల్( Banoth Madanlal ) క‌న్నుమూశారు. గుండెపోటు( Heart Attack )తో ఏఐజీ ఆస్ప‌త్రి( AIG Hospital )లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

  • By: raj |    telangana |    Published on : May 27, 2025 7:37 AM IST
Banoth Madanlal | వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మ‌ద‌న్‌లాల్ క‌న్నుమూత‌

Banoth Madanlal | హైద‌రాబాద్ : వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మ‌ద‌న్‌లాల్( Banoth Madanlal ) క‌న్నుమూశారు. గుండెపోటు( Heart Attack )తో ఏఐజీ ఆస్ప‌త్రి( AIG Hospital )లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైరా( Wyra ) నుంచి వైసీపీ( YCP ) త‌ర‌పున ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అనంత‌రం బీఆర్ఎస్( BRS ) పార్టీలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓట‌మి చ‌విచూశారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీఆర్ఎస్ వైరా నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జిగా ఉన్నారు.

మదన్ లాల్ మృతితో వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విషాదఛాయలు నెలకొన్నాయి. మ‌ద‌న్‌లాల్ మృతిప‌ట్ల బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. వైరా నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌ద‌న్ లాల్ మ‌ద్ద‌తుదారులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన మ‌ద‌న్‌లాల్‌ను హైదరాబాద్‌ ఏఐజీ దవాఖానకు కుటుంబ స‌భ్యులు త‌ర‌లించారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. గతవారం ఖమ్మంలోని ఆయన నివాసంలో వాంతులు వీరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానలో చేర్పించారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఏఐజీ హాస్పిటల్‌కు తరలించిన‌ట్లు కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు.