AIG Hospital| గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ఠాగూర్ మూవీ సీన్
హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా సీన్ సాక్ష్యాత్కరించింది. ఠాగూర్ సినిమాలో మాదిరిగానే చనిపోయిన వ్యక్తికి చికిత్స చేస్తున్నట్లుగా బిల్లులు కట్టించుకుని..చివరకు చనిపోయాడని చెప్పి ఆసుపత్రి నిర్వాహకులు మోసం చేశారని పేషంట్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన ఘటన వైరల్ గా మారింది.
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ గచ్చిబౌలి(Gachibowli) ఏఐజీ ఆసుపత్రిలో(AIG Hospital) ఠాగూర్ సినిమా(Thagoor movie) సీన్ సాక్ష్యాత్కరించింది. ఠాగూర్ సినిమాలో మాదిరిగానే చనిపోయిన వ్యక్తికి(Death Patient) చికిత్స చేస్తున్నట్లుగా బిల్లులు కట్టించుకుని..చివరకు చనిపోయాడని చెప్పి ఆసుపత్రి నిర్వాహకులు మోసం చేశారని పేషంట్ కుటుంబ సభ్యులు(patient family protests) ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన ఘటన వైరల్ గా మారింది. లివర్ ట్రాన్స్ ప్లాంట్(Liver Transplant) కోసం ఆసుపత్రిలో చేరిన వ్యక్తి..రూ.35 లక్షలకు ప్యాకేజీ మాట్లాడుకున్నాడు. ఆసుపత్రి నిర్వాహకులు రూ. 85 లక్షలు బిల్ చేశారు. దీంతో ఇల్లు అమ్ముకొని మరీ పేషంట్ కుటుంబ సభ్యలు ఆసుపత్రి బిల్లు కట్టారు. తీరా బిల్లు కట్టిన తర్వాత అతడు మరణించినట్లుగా కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. బిల్లు కట్టాకే పేషంట్ చనిపోయాడని చెప్పిన దానిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను రెండు రోజుల క్రితమే మరణించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. తమను ఆసుపత్రి నిర్వాహకులు డబ్బుల కోసం మోసం చేశారంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
బిల్లుల కోసం ఇళ్లు..భూమి అమ్ముకున్నాను..
ఏఐజీ ఆసుపత్రి ఘటనపై మృతుడి భార్య మాట్లాడుతూ స్వయంగా నా భర్తకు లివర్ ఇచ్చానని..15రోజులుగా ఆసుపత్రిలో వైద్యం చేస్తూ..కోలుకుంటున్నారని చెప్పి..వరుసగా బిల్లులు కట్టించుకున్నారని తెలిపారు. ఆసుపత్రి బిల్లులకు నా భూమి, ఇల్లు కూడా అమ్మేశానని..85లక్షలు కట్టాక.. ఇక కట్టలేమంటూ చెబితే ..వేరే ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పి..అంబులెన్స్ లోకి నాభర్తను ఎక్కించి చనిపోయాడని చెప్పారని వాపోయింది. కేవలం బిల్లుల కోసమో నా భర్త చనిపోయిన విషయం దాచిపెట్టి మమ్మల్ని మోసం చేసి బిల్లులు కట్టించుకున్నారని ఆరోపించింది. ఆసుపత్రి బిల్లుల కోసం చేసిన మోసంతో.. నా ఆస్తులన్ని అమ్ముకుని నష్టపోయానని నా కుటుంబానికి న్యాయం చేయాలని బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram