Maganti Gopinath Death News| మాగంటి గోపినాథ్ మృతిపై విచారణ జరుపండి : తల్లి ఫిర్యాదు

దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, సమగ్ర దర్యాప్తు చేయాలని గోపినాథ్ తల్లి మాగంటి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Maganti Gopinath Death News| మాగంటి గోపినాథ్ మృతిపై విచారణ జరుపండి : తల్లి ఫిర్యాదు

విధాత, హైదరాబాద్ : దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి(Maganti Gopinath death)పై అనేక అనుమానాలు ఉన్నాయని, సమగ్ర దర్యాప్తు(Investigation) చేయాలని గోపినాథ్ తల్లి మాగంటి మహానంద కుమారి(Maganti Mahananda Kumari) రాయదుర్గం పోలీసుల(Complaint Filed) కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తన కుమారుడు మాగంటి గోపినాథ్ అనారోగ్యం, ఏఐజీ ఆసుపత్రిలో అందిన చికిత్స, ఆసుపత్రి వైద్యులు, వ్యవహర శైలీపై అనుమానాలున్నాయని తెలిపారు. నన్ను నాకుమారిడిని చూసేందుకు ఆసుపత్రి సిబ్బంతి అనుమతించలేదని, కేటీఆర్ ను మాత్రమే అనుమతించారని, దీనిపై నేను కేటీఆర్ ను అడిగినా..ఆయన పట్టించుకోలేదని ఫిర్యాదులో ఆరోపించారు.

తల్లిగా నా కొడుకును చూడకుండా నన్ను అడ్డుకోవడంతో పాటు గోపినాథ్ చికిత్స సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది కేటీఆర్, సునీత కుటుంబం చెప్పినట్లుగా వ్యవహరించారని మహానందకుమారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లిని, గోపినాథ్ అన్న వజ్రనాథ్, ఆయన కుటుంబ సభ్యులను ఆసుపత్రిలోని గోపినాథ్ గదికి అనుమతించవద్దంటూ గోపీనాథ్ కుమార్తె దిశిర ఏఐజీ ఆసుపత్రి సెక్యూరిటీ ఇంఛార్జ్ కి రాసిన లేఖను కూడా మహానందకుమారి తన ఫిర్యాదు లేఖతో పాటు పోలీసులకు సమర్పించడం విశేషం.