• Telugu News
  • /Telangana

ఆలేరు నియోజకవర్గంలో కాళేశ్వరం జలాల సందడి!

కాళేశ్వరం జలాలతో ఆలేరు నియోజకవర్గంలో ఆనందం వెల్లివిరిసింది. బిక్కెరు వాగులోకి గోదావరి నీళ్లు చేరడంతో రైతులు సంబరాలు జరుపుకున్నారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Apr 02, 2026, 1:58 pm IST
Read Time: 3 mins
ఆలేరు నియోజకవర్గంలో కాళేశ్వరం జలాల సందడి!

విధాత : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలం రాయపల్లి గ్రామంలోని బిక్కేరు వాగులోకి గోదావరి జలాలు చేరుకోవడం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగానే బిక్కెరు వాగులోకి గోదావరి నీళ్లు వస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేస్తున్నారు. సూదుర ప్రాంతాల నుంచి తమ దరికి చేరిన గోదావరి జలాలను ఈ ప్రాంత అన్నదాదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ ముందుచూపు, దార్శనికతతో నిర్మించిన కాళేశ్వరంతోనే బిక్కెరుకు గోదావరి జలాలు వచ్చాయంటూ హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక రైతులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మరోవైపు ఇటీవలే ఇదే జిల్లాలో మూసీ ఆధారిన బునాది గాని కాలువ కు బస్వాపూర్ రిజర్వాయర్ కాలువ లింక్ ద్వారా గోదావరి జలాలు చేరడం గమనార్హం. ఇక్కడ గోదావరి-మూసీ నదుల అనుసంధానం జరిగిపోవడం మరో విశేషం.

ఇవి కూడా చదవండి :

MLA Sudheer Reddy : దోమలను అరికట్టండి మహాప్రభో : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన
Telangana Liquor Sales | ఖజనాకు మందు కిక్కు..తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు!