Kavitha Demands OBC Sub Quota | మహిళా రిజర్వేషన్లలో సబ్ కోటా ఇవ్వాలి : కవిత

రానున్న మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Mar 25, 2026, 12:50 pm IST
Read Time: 3 mins
Kavitha Demands OBC Sub Quota | మహిళా రిజర్వేషన్లలో సబ్ కోటా ఇవ్వాలి : కవిత

విధాత, హైదరాబాద్ : చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు భారతీయ ఆడబిడ్డల దశాబ్దాల కల అని, ఈ బిల్లుకు చట్టబద్దత కోసం తెలంగాణ జాగృతి అవిశ్రాంత పోరాటాలు చేసినట్లుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రానున్న మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

డిల్లీ జంతర్ మంతర్ వేదికగా దేశంలోని అత్యధిక పార్టీలను సమీకరించి జాగృతి నిరాహార దీక్ష చేపట్టింది అని గుర్తు చేశారు. . మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో ఆ కోటాలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఉండాలని అంతే గట్టిగా జంతర్ మంతర్ వేదికగా నినదించిందని పేర్కొన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని కూడా తీర్మానించింది అని తెలిపారు.

మహిళల దశాబ్దాల కల నెరవేరే కాలం ఆసన్నమవుతున్న ప్రస్తుత తరుణంలో మహిళా కోటాలో సబ్ కోటా ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం అని కవిత స్పష్టం చేశారు.
ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వకుంటే మహిళా రిజర్వేషన్లు వచ్చినా ఆయా వర్గాల ఆడబిడ్డలకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కదని మరోసారి ఆందోళన వెలిబుచ్చుతున్నాం అన్నారు. మహిళా కోటాలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నట్లుగా కవిత పునురుద్ఘాటించారు.

ఇవి కూడా చదవండి :

Prince Yawar | బిగ్‌బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్ సంచలన ఆరోపణలు.. బిల్డర్‌పై మోసం, హనీ ట్రాప్ కేసు నమోదు
Monalisa | దర్శకుడిపై నటి మోనాలిసా భోంస్లే లైంగిక వేధింపుల ఆరోపణలు ..అస‌భ్యంగా తాకేవాడ‌ని చెప్పినా..