విధాత : పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర రెండో రోజు గురువారం సూర్యాపేట నుంచి వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా సాగుతూ భువనగిరికి చేరుకుంది. సాయంత్రం 6 గంటలకు భువనగిరిలో బీఆరెస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌కు మద్దతుగా నిర్వహించనున్న రోడ్డుషోలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. బస్సుయాత్ర షెడ్యూల్ అనుసరించి ఉదయం కేసీఆర్ రైతు సమస్యలను తెలుసుకున్నారు. సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బ తండాలో 5 ఎకరాలు ఎండిపోవడంతో ఆవేదన చెందిన రైతు ధరావత్ నర్సింహను కేసీఆర్ కలిశారు. ఆయన సమస్యలు విని ఆదుకుంటామని భరోసానిచ్చారు. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర వరుసగా కొనసాగుతుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఉండే విధంగా బస్సు యాత్ర కొనసాగుతుంది.
భువనగిరికి కేసీఆర్ బస్సు యాత్ర.. రైతులకు పరామర్శ
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర రెండో రోజు గురువారం సూర్యాపేట నుంచి వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా సాగుతూ భువనగిరికి చేరుకుంది

Latest News
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల
లోక్‌సభలో ఏడు కీలక బిల్లులకు సిద్ధమైన కేంద్రం
భారత్ లో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు!
తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం
ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!
పసికందు వద్దకు పాము..నెమలికి ఆహారం..వైరల్
ఈవిడ ఆవిడేనా…నటి నమిత వీడియో వైరల్
కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ఒంటరి ఏనుగు పట్టివేత..బాధిత గ్రామాలకు ఊరట