దళితులను మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధం .. మంద కృష్ణ మాదిగ
విధాత:దళితులను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అన్నారు.హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలవుతుందని..అందుకే అధికారాన్ని కోల్పోతామనే భయంతోనే కేసీఆర్ దళితబంధు పేరుతో సరికొత్త నాటకానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత ఓట్ల కోసమే ఈ పథకాన్ని తీసుకొస్తున్నారని అన్నారు. దళితుల జీవితాలలో సమూల మార్పులను తీసుకొచ్చేందుకు దళితబంధును తీసుకొస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. […]

విధాత:దళితులను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అన్నారు.హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలవుతుందని..అందుకే అధికారాన్ని కోల్పోతామనే భయంతోనే కేసీఆర్ దళితబంధు పేరుతో సరికొత్త నాటకానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత ఓట్ల కోసమే ఈ పథకాన్ని తీసుకొస్తున్నారని అన్నారు.
దళితుల జీవితాలలో సమూల మార్పులను తీసుకొచ్చేందుకు దళితబంధును తీసుకొస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.