నాకు రేవంత్ రెడ్డితో ఎలాంటి ఇబ్బంది లేదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవన్న రాజగోపాల్ రెడ్డి.. అసెంబ్లీలో కేటీఆర్‌తో సాధారణ సంభాషణ మాత్రమేనని స్పష్టం, మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు
విధాత, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డితో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని, నిన్న అసెంబ్లీ హాల్ లో ఎదురుపడితే మాట్లాడానని, ఇందులో ప్రత్యేక భేటీ ఏదీ లేదు అని, ఎదురుపడితే పలకరించుకున్నామని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. ఈ రోజు అసెంబ్లీ డైనింగ్ హాల్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో మాట్లాడంపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినట్లుగానే..ఈ రోజు కేటీఆర్ తో కూడా సాధారణంగా అన్ని విషయాలపై మాట్లాడినట్లుగా చెప్పుకొచ్చారు. నాకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం గతంలో హామీ ఇచ్చింది అని, అధిష్టానం ఇపుడు ఏం చేస్తుందో తెలియదు అన్నారు. నేను మంత్రి పదవి కోసం పాకులాడడం లేదు అని, ఏ పదవి లేకున్నా రాజగోపాల్ రెడ్డికి ప్రజల్లో తగిన గౌరవం ఉంటుందని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి వచ్చినా రాకపోయినా నిజం మాట్లాడతానని స్పష్టం చేశారు. నాకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది అన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే నా లాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు అవసరం అని గుర్తు చేశారు.
కేటీఆర్ తో మాట్లాడిన సందర్బంలో 2018 ఎన్నికల్లో 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం తప్పని చెప్పానన్నారు.
సాధారణ సంభాషణ మాత్రమే : పాయల్ శంకర్
కేటీఆర్, రాజగోపాల్ రెడ్డిలతో కలిసి లంచ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మా మధ్య సాధారణ సంభాషణ మాత్రమే కొనసాగిందన్నారు. పోలీసులను వాడుకున్న ఏ రాజకీయ నేత బాగుపడడని చెప్పినట్లుగా తెలిపారు. బీఆర్ఎస్ తో భవిష్యత్తులో బీజేపీకి ఎలాంటి పొత్తు ఉండబోదన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టబోతుందని, ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి :
IRCTC Ticket Cancellation New Rules : రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ లో కొత్త మార్పులు
మహేష్ కుమార్ గౌడ్ బీసీ సీఎం వ్యాఖ్యల మర్మమేమిటో?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram