తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజిలో నేను లేను : మంత్రి కోమటిరెడ్డి

తన తమ్ముడైన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే స్టేజిలో నేను లేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

  • By: Subbu |    telangana |    Published on : Aug 05, 2025 9:57 PM IST
తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజిలో నేను లేను : మంత్రి కోమటిరెడ్డి

న్యూఢిల్లీ : తన తమ్ముడైన మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే స్టేజిలో నేను లేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామిరెడ్డి, సురేష్ షెట్కర్ లతో కలిసి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తెలంగాణలో జాతీయ రహదారులు ప్రాజెక్టులపైన, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు నిర్మిస్తున్న డబుల్ డెక్కర్ కారిడార్ వే కు కేంద్ర సహకారం పైన చర్చించారు. హైదరాబాద్ అమరావతి మధ్య గ్రీన్ ఫీల్డ్ హై వే నిర్మాణం పైన చర్చించారు.

అనంతరం మంత్రి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే స్టేజి లో లేనని కామెంట్ చేశారు. నన్ను అడిగితే ఏమి చెప్పలేనన్నారు. మంత్రి వర్గంలో నేనొక సీనియర్ మంత్రిని మాత్రమే..జాతీయ పార్టీ అగ్రనాయకత్వం.. సీఎం, టీపీసీసీలు దీనిపై అభిప్రాయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఓక సారి ఎంపీగా, పార్టీలో సీనియర్ గా ఉన్నానని గుర్తు చేశారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి పదవిపై హామీ ఇచ్చినట్టు నాకు తెలియదని..ఇస్తే మంచిదేనని చెప్పారు.