Konda Vishweswar Reddy : చెట్టినాడ్ ఫ్యాక్టరీ, రైల్వేశాఖలపై ఎంపీ కొండా సీరియస్

తాండూరులో చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించిన రైలు మార్గం కారణంగా వరదల్లో మునిగిన ఇళ్లు, పంటపొలాలను పరిశీలించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రైల్వే, ఫ్యాక్టరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరిహారం డిమాండ్.

Konda Vishweswar Reddy : చెట్టినాడ్ ఫ్యాక్టరీ, రైల్వేశాఖలపై ఎంపీ కొండా సీరియస్

విధాత, హైదరాబాద్ : తాండూరు మండలం సంగెంకలాన్ లో చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ, రైల్వే శాఖ చర్యలతో వరదలలో మునిగిపోయిన ఇళ్లు, పంట పంటల పొలాలను పరిశీలించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం తమ పొలాల మీదుగా నిర్మించిన రైలు మార్గంతో భారీ వర్షాల సమయంలో పంట పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఎంపీ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముంపు పొలాలను, రైల్వే ట్రాక్ ను పరిశీలించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమస్యకు కారణమైన చెట్టినాడ్ ఫ్యాక్టరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు వెంటనే పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేవలం నిర్మాణ వ్యయం తగ్గించుకుని డబ్బులు మిగుల్చుకునేందుకు వంతెన ఫిల్లర్లు తగ్గించి రైల్వే ట్రాక్ నిర్మించారన్నారు. దీంతో వరద నీళ్లు ఇక్కడ నుంచి పోలేక ఇళ్లను, పంటపొలాలను ముంచుతున్నాయన్నారు. ఈ సమస్యపై బాధితులు ప్రశ్నిస్తే ఫ్యాక్టరీ, రైల్వేశాఖ పరస్పరం మీరంటే మీరంటే చర్యలు తీసుకోవాలంటూ తిప్పుతున్నారని మండిపడ్డారు. దీనిపై వెంటనే రైల్వే శాఖ, చెట్టినాడ్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి వారికి పరిహారం ఇవ్వాలని, రైల్వే ట్రాక్ వంతెన పిల్లర్లు ఎక్కువగా వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామన్నారు.