Almatti | 1.75 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో గేట్లు తెరువడానికి రంగం సిద్ధం వారం రోజుల్లో శ్రీశైలానికి వరద నీరు విధాత: కర్ణాటకలోని అల్మట్టి ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండటంతో గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. గురువారం ఉదయం వరకు గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలే అవకాశం ఉంది. కృష్ణా నది జన్మ స్థలమైన మహాబలేశ్వర్, పశ్చిమ కనుమలు, దిగువన ఉన్న కొల్హాపూర్ జిల్లాలో అతి భారీ […]
Almatti |
విధాత: కర్ణాటకలోని అల్మట్టి ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండటంతో గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. గురువారం ఉదయం వరకు గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలే అవకాశం ఉంది. కృష్ణా నది జన్మ స్థలమైన మహాబలేశ్వర్, పశ్చిమ కనుమలు, దిగువన ఉన్న కొల్హాపూర్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహాబలేశ్వర్లో 18 సెం.మీ., కొల్హాపూర్ జిల్లాలో 12 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
మరో రెండ్రోజుల పాటు అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ముందస్తు సూచన జారీ చేసింది. ఆల్మటి ఇన్ ఫ్లో 1.75 లక్షల క్యూసెక్కుల నుంచి 2 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నదని సెంట్రల్ వాటర్ కమిషన్ వరద హెచ్చరిక విడుదల చేసింది. కొల్హాపూర్ జిల్లాలోని దూధ్ గంగ పరివాహక ప్రాంతంలో ఆల్మట్టి బ్యాక్ వాటర్స్ వల్ల ముంపు సమస్య తలెత్తింది. దీంతో కొల్హాపూపూర్ జిల్లా కలెక్టర్ ఆల్మట్టి గేట్లు ఎత్తి నీటిని కిందకు వదలాలని విజ్ఞప్తి చేశారు.
తద్వారా ముంపు భారీ నుంచి దూధ్ గంగ పరివాహక ప్రాంతాల ప్రజలను కాపాడ వచ్చునని తెలిపారు. ఒక వైపు వరద ప్రవాహం పెరుగుతుండంతో పాటు, దూధ్ గంగ ప్రాంతాన్ని ముంపు భారీ నుంచి తప్పించడానికి ఆల్మట్లి డ్యాం గేట్లు ఎత్తాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్ణాటక ఇరిగేషన్ శాఖ నీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది.
గురువారం ఉదయం వరకు ఆల్మట్టి గేట్లు తెరిచి 30 వేల క్యూసెక్కుల దాకా దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. ఆల్మట్టిలో ఇప్పటికే జల విద్యత్తుకేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. మరోవైపు తుంగభద్రకు 1.50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. జూలై నెలాఖరు నాటికి కర్ణాటక లోని అన్ని జలాశయాలు పూర్తిగా నిండే అవకాశం ఉంది.
తుంగభద్ర, ఆల్మట్టి, నారాయణపుర, జూరాల ప్రియదర్శిని రిజర్వాయర్లు నిండితే మరో వారం రోజుల్లో శ్రీశైలానికి 2.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. బుధవారం ఉదయం 6 గంటల సమయానికి ఆల్మట్టికి 1,38,473 క్యూసెక్కుల వరద వస్తున్నది. సాయంత్రం వరకు ఈ ప్రవాహం పెరిగినట్లు ప్రాజెక్ట్ అధికారులు చెపుతున్నారు.
ఆల్మట్టి గరిష్ఠ నీటి మట్టం 1705 అడుగులు, 129.72 టీఎంసీలు కాగా బుధవారం ఉదయం 6 గంటల వరకు 1695.67 అడుగులు, 85.55 టీఎంసీల నీరు ఉన్నది. గంట గంటకు వరద నీటి ప్రవాహం పెరుగుతుండడంతో నీటి విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.