MP Chamala Kiran Kumar Reddy| కేటీఆర్ కు ఛాలెంజ్ చేసే అర్హత లేదు : ఎంపీ చామల

MP Chamala Kiran Kumar Reddy| కేటీఆర్ కు ఛాలెంజ్ చేసే అర్హత లేదు : ఎంపీ చామల

కేటీఆర్ కు ఛాలెంజ్ చేసే అర్హత లేదు
గతంలో ఛాలెంజ్ చేసి తప్పించుకున్నారు
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే అర్హత లేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ ఉత్తర కుమారుని మాటలు బంద్ చేయాలని..మీకు ఛాలెంజ్ లు అచ్చిరావని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా కేటీఆర్ చాలెంజ్ లు చేసిన సందర్భాలు ఉన్నాయని..ఛాలెంజ్ లు చేసి తప్పించుకపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంటూ వాటిని చామల గుర్తు చేశారు. గతంలో డ్రగ్స్ టెస్టు కోసం.. బొచ్చు ఇస్తా.. కిడ్నీ ఇస్తా అన్ని ఇస్తా అని తప్పించుకపోయిన సందర్భాలు ఉన్నాయని చామల గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ప్రెస్ క్లబ్ కు రమ్మని చెప్పి ప్రెస్ క్లబ్ దూరం ఉందని, జూబ్లీహిల్స్ క్లబ్ కి రమ్మని, సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంది అక్కడికి రమ్మని అంటే అక్కడికి వచ్చే పరిస్థితి ప్రభుత్వానికి ఉండదని చామల చురకలేశారు. ఇవాళ మీ 10 సంవత్సరాల పాలన సరిగ్గా లేదని భావించి ప్రజలు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం అని గుర్తు చేశారు.

ఈరోజు ఏడాదిన్నర పాలనలో రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయల సిలిండర్, ఇవన్నీ పథకాలు వచ్చాయా లేవా అనేది ప్రజలు చెప్తారన్నారు. ప్రభుత్వాన్ని, సీఎంను సవాల్ చేసే అర్హత..స్థాయి లేదని.. నువ్వు వెళ్లి మీ నాన్నకాళ్ళ వేళ్ళ పడి ప్రతిపక్ష నాయకుడి హోదా తెచ్చుకొని అప్పుడు మా సీఎంను, ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయ్ అని చామల పేర్కొన్నారు. మీ నాయన కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు లేవని.. ఫాం హౌస్ ల కూర్చున్న మీ నాయనని బ్రతిమిలాడి అసెంబ్లీకి తీసుకొచ్చి ఈ ప్రజా పాలనపై తెలంగాణ ప్రజల ముందు చర్చించవచ్చు అని కేటీఆర్ కు చామల సూచించారు. మీ ఇంట్లో నీ అర్హత ఎలా ఉందో.. తెలంగాణ ప్రజలకు.. మాకు తెలుసు అని.. నిన్ను లెక్క పెట్టే పరిస్థితి మీ కుటుంబ సభ్యులలో నీకు లేదని కేటీఆర్ పై చామల మండిపడ్డారు.