ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మంత్రి సురేఖ..యెన్నం, కేకేలకు కేటీఆర్ నోటీస్‌లు

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మంత్రి సురేఖ..యెన్నం, కేకేలకు కేటీఆర్ నోటీస్‌లు

విధాత, హైదరాబాద్‌ : ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కేకే మహేందర్‌ రెడ్డికి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ లీగల్‌ నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసింనందుకు, పరువు నష్టం చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు.

ఈ మేరకు పరువు నష్టం కింద ఆ ముగ్గురికి కేటీఆర్‌ లీగల్ నోటీస్‌లు పంపించారు. ఫోన్ ట్యాపింగ్‌తో కేటీఆర్ ప్రతిపక్ష నాయకుల, వ్యాపారుల ఫోన్లతో పాటు సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని కొండా సురేఖ, యెన్నం, కేకేలు ఆరోపించారు. దీనిపై సీరియస్‌గా స్పదించిన కేటీఆర్ లీగల్ చర్యలకు సిద్ధపడ్డారు.