KTR | దేశ చరిత్రలో అసమాన విజయగాథ యాదాద్రి థర్మల్ ఫ్లాంట్
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్నయాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటులో రెండు యూనిట్లలో బాయిలర్లను మండించే ప్రక్రియ (లైటప్) ట్రయల్ రన్ కొద్దిరోజుల క్రితం విజయవంతంగా పూర్తయింది.

ట్రయల్ రన్ సక్సెస్‌పై కేటీఆర్ ట్వీట్
విధాత : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్నయాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటులో రెండు యూనిట్లలో బాయిలర్లను మండించే ప్రక్రియ (లైటప్) ట్రయల్ రన్ కొద్దిరోజుల క్రితం విజయవంతంగా పూర్తయింది. దీంతో జెన్‌కో అధికారులు అక్టోబర్ 10 నాటికి 800 మెగావాట్ల సామర్థ్యం గల ఈ రెండు యూనిట్ల నుంచి విద్యుదుత్పాదన ప్రారంభించాలని నిర్ణయించారు. దీనిపై స్పందించిన బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్( వైటీపీఎస్ )పై ట్వీట్ చేశారు.
Delighted to share that the boiler light up of two units of Yadadri Thermal Power Station (YTPS) in Nalgonda District was done by engineers last week
YTPS is a classic example of the bold vision and unmatched execution of KCR garu. Look at some astounding facts:
⚡⚡With a… pic.twitter.com/OCdOCztyX5
— KTR (@KTRBRS) May 25, 2024
యాదాద్రి పవర్ స్టేషన్‌లో ఒకటి, రెండు యూనిట్లలో బాయిలర్ లైట్ ప్రక్రియ విజయవంతమైందని గత వారం ఇంజినీర్లు చెప్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ దృఢ సంకల్పానికి వైటీపీఎస్ ఒక అద్భుతమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. మన దేశ చరిత్రలో అసమానమైన విజయగాథ ఇది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
మొత్తం 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ వైటీపీఎస్ అని పేర్కోన్నారు. వైటీపీఎస్ నిర్వహణను గత బీఆరెస్ ప్రభుత్వం బీహెచ్ఈఎల్‌కు అప్పగించిందని, ఈ ప్రాజెక్టు విలువ రూ. 20,400 కోట్లు అని తెలిపారు. 2014లో కేవలం 7,770 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం నుండి, బీఆరెస్ ప్రభుత్వం పదేళ్లలో విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని దాదాపు 20,000 మెగావాట్లకు పెంచిందని చెప్పుకున్నారు.