సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డితోనే ప్రశాంతత
ఉమ్మడి నల్గొండ: సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్ రెడ్డికి మద్దతుగా కార్మిక, వ్యాపార సంఘాలు ఏకమవుతున్నాయి.
- 2014 తర్వాత రౌడీ మామూళ్లు, బెదిరింపులు లేవు
- బీఆర్ఎస్ కు మార్వాడి వ్యాపారుల సంపూర్ణ మద్దతు
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్ రెడ్డికి మద్దతుగా కార్మిక, వ్యాపార సంఘాలు ఏకమవుతున్నాయి. 2014కు ముందు సిండికేట్ లు, రౌడీమామూళ్లు, బెదిరింపులతో వ్యాపారం చేసుకోవాలంటే అవస్థలు పడిన తాము.. 2014 తర్వాత ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకుంటున్నామని సూర్యాపేటలో స్థిరపడిన మార్వాడి వ్యాపారులు పేర్కొన్నారు. ఈఘనత జగదీశ్ రెడ్డిదే అంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్న మార్వాడి వ్యాపారులు, తమ సమావేశానికి జగదీశ్ రెడ్డిని ఆహ్వానించి తమ మద్దతును ప్రకటించారు. మంత్రి నాయకత్వంలో అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా సూర్యాపేట నిలవడం ఖాయం అన్న వ్యాపారులు, పార్టీలకు అతీతంగా మంత్రికి మద్దతు తెలిపి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram