విప్లవ సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిద్దాం.. అరుణోదయ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ లో వక్తల పిలుపు

దేశంలో పెరుగుతున్న హిందూ బ్రాహ్మణీయ ఫాసిస్టు భూస్వామ్య సంస్కృతి పెచ్చరిల్లుతోందని దీనికి ప్రత్యామ్నాయంగా శ్రామిక వర్గ సంస్కృతి సాహిత్యం, కళలు, సాంస్కృతిక ఉద్యమ నిర్మాణం చేయడమే మన ముందున్న కర్తవ్యం అని వక్తలు అభిప్రాయపడ్డారు .

విప్లవ సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిద్దాం.. అరుణోదయ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ లో వక్తల పిలుపు

విధాత ప్రత్యేక ప్రతినిధి: సామ్రాజ్యవాద ,పెట్టుబడి దారి ,భూస్వామ్య సంస్కృతికి వ్యతిరేకంగా విప్లవ సంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించాలని అరుణోదయ సంస్కృతిక సమాఖ్య రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వక్తలు పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలోని రాయల రమేష్ నగర్ లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమాఖ్య అధ్యక్షులు పి. వేణు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కే. గోవర్ధన్, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు నాగన్న , ఆంధ్రప్రదేశ్ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి జాలన్న, ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ జగదీష్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య, ప్రముఖ కవి రచయిత యోచన, పి వై ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి అనురాధ, అరుణోదయ నాయకులు తారాచంద్, శ్రీశైలం, టి పి టి ఎఫ్ జిల్లా నాయకులు , మహమ్మద్ అలీ, న్యూ డెమోక్రసీ నాయకులు బండి కోటేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు కల్లపెల్లి ప్రణయ్ మాదిగ, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు సామ్రాతి మల్లేశం, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పూలక్క, పిడిఎస్యు నాయకులు గుర్రం అజయ్ లు ప్రసంగించారు.

ముందుగా విప్లవ సాంస్కృతిక ఉద్యమం కొరకు పోరాడి అమరులైన అందరికీ జోహార్లు తెలిపారు.దేశంలో పెరుగుతున్న హిందూ బ్రాహ్మణీయ ఫాసిస్టు భూస్వామ్య సంస్కృతి పెచ్చరిల్లుతోందని దీనికి ప్రత్యామ్నాయంగా శ్రామిక వర్గ సంస్కృతి సాహిత్యం, కళలు, సాంస్కృతిక ఉద్యమ నిర్మాణం చేయడమే మన ముందున్న కర్తవ్యం అని వక్తలు అభిప్రాయపడ్డారు . గాయకులు ఆలపించిన విప్లవ గీతాలు, నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి. సభకు ముందు నర్సంపేట బస్టాండు సెంటర్ నుండి అంగడి సెంటర్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు వందలాది మంది అరుణోదయ కళాకారులు గొంగడి లు వేసుకొని డప్పు వాయిద్యాలతో కోలాటాలు వేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో, గంగుల దయాకర్, రాచర్ల బాలరాజు, గట్టి కృష్ణ, తిరుపతి, పాణి తదితరులు పాల్గొన్నారు.