Malabar Gold | ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’ 15వ ఎడిషన్‌ను ఆవిష్కరించిన మలబార్ గోల్డ్ & డైమండ్స్

భారత దేశంలోని ప్రతి వధువు, తన భావోద్వేగాల ప్రపంచంలో విహరిస్తూ ఉంటుంది. ఆమె చూస్తూ పెరిగిన ఆచారాలు, ఆమె చుట్టు ఉన్న సంస్కృతి, ఆమె మదిలో నిక్షిపమైన జ్ఞాపకాలు, ఆమె జీవితంలోని అత్యంత ముఖ్యమైన రోజులలో ఆమె గుర్తింపులో కీలక పాత్ర పోషించే ఆభరణాలు.

Malabar Gold | ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’ 15వ ఎడిషన్‌ను ఆవిష్కరించిన మలబార్ గోల్డ్ & డైమండ్స్

భారత దేశంలోని ప్రతి వధువు, తన భావోద్వేగాల ప్రపంచంలో విహరిస్తూ ఉంటుంది. ఆమె చూస్తూ పెరిగిన ఆచారాలు, ఆమె చుట్టు ఉన్న సంస్కృతి, ఆమె మదిలో నిక్షిపమైన జ్ఞాపకాలు, ఆమె జీవితంలోని అత్యంత ముఖ్యమైన రోజులలో ఆమె గుర్తింపులో కీలక పాత్ర పోషించే ఆభరణాలు. ప్రపంచంలో అతిపెద్ద బంగారు..వజ్రాభరణాల రిటైల్ వ్యాపార సంస్థల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ & డైమండ్స్, భారతదేశం గొప్ప సాంస్కృతిక వైభవంలో వివాహాభరణాల ప్రాముఖ్యతను ఎప్పటి నుండో అర్థం చేసుకుంటుఉన్నది. ప్రతి వధువు సంప్రదాయాన్ని గౌరవిస్తూ, స్వచ్ఛత, నిష్ట, నైపుణ్యం కలబోసి, ఎంతో శ్రద్ధగా ఎంపిక చేసిన ప్రత్యేక డిజైన్లతో రూపొందించిన వివాహాభరణాలను అందిస్తుంది మలబార్ గోల్డ్ & డైమండ్స్. దేశంలోని అన్ని ప్రాంతాల వధువుల ప్రత్యేక సంప్రదాయాలను గౌరవించేలా, అత్యంత నైపుణ్యంతో, సాటిలేని ఆభరణాలను తీర్చిదిద్దడంలో, అపూర్వమైన వారసత్వాన్ని సృష్టించింది మలబార్ గోల్డ్ & డైమండ్స్.

ఒక ప్రధాన మైలురాయిని నమోదు చేస్తూ, అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’ 15వ ఎడిషన్ ప్రచారాన్ని మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఈ రోజు (మంగళవారం) ఆవిష్కరించింది. భారతదేశంలో ఎంతో పెద్దదైన దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే బ్రైడల్ ప్రాపర్టీల్లో ఇదొకటి. ఈ ఏడాది ఈ ఎడిషన్లో మొత్తం 22 మంది వధువులు 10 మంది ప్రముఖులు – ఎన్టీఆర్, కార్తి, ఆలియా భట్, కరీనా కపూర్ ఖాన్, అనిల్ కపూర్, శ్రీనిధి శెట్టి, రుక్మిణి మైత్ర, సబ్యసాచి మిశ్రా, ప్రార్థన బెహేరే, మనసి పారేఖ్ పాల్గొనడంతో, ఈ ప్రచారం స్థాయి, వైవిధ్యం భావోద్వేగ గాఢత ప్రతిబింబిస్తాయి.

బ్రైడ్స్ ఆఫ్ ఇండియా 15వ ఎడిషన్ ప్రాధాన్యతను గురించి అడిగినప్పుడు, మలబార్ గోల్డ్ & డైమండ్స్ చైర్మన్ శ్రీ ఎం.పి.అహమ్మద్ ఇలా అన్నారు “ప్రతి ఏడాది ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’ మన దేశంలోని వధువులకు ఒక గుర్తుగా భావిస్తాం, ఈ 15వ ఎడిషన్ మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోంది. వధువులు తమ సంప్రదాయాలను గౌరవిస్తూనే, వాటికి తమ స్వీయ వ్యక్తీకరణలను ఎలా జోడిస్తారో ఇప్పుడు బలంగా చెప్పాము. ఆ సంప్రదాయాల లోతును, ఆమెను నిర్వచించే జ్ఞాపకాలను, ఆచారాలను, బంధాలను సంబరంగా ప్రదర్శిస్తుంది. పారదర్శకత, నాణ్యత హామీ పట్ల మలబార్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది, ప్రత్యేకమైన, నమ్మకమైన ఆభరణాలను ఎంచుకోవడంలో ప్రతి కుటుంబం విశ్వాసంతో ఉండాలని మేము కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు.

భారత దేశ వైవిధ్యానికి ఒక వేడుక:
మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా ప్రచారం, భారతీయ వివాహ సంప్రదాయాల అసాధారణ వైవిధ్యాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. భారత దేశం వైవిద్యభరితమైన సంస్కృతీ సంప్రదాయాల పూర్తి వర్ణపటాన్ని స్పష్టంగా చూపిస్తుంది. తూర్పు మొదలుకుని పడమర, ఉత్తరం, దక్షిణం వరకూ ప్రతి ప్రాంతపు సాంస్కృతిక గుర్తింపునకు అనుగుణంగా రూపొందించిన ఆభరణాలు ఈ కలెక్షన్లో ఉన్నాయి. రాజసమైన రాజస్థాన్ ‘రీగల్ పోల్కీ’ ఆభరణాలు, తమిళనాడు దేవాలయ కళా స్ఫూర్తితో రూపొందిన కళాత్మక బంగారు ఆభరణాలు, కేరళ సంప్రదాయ కసావు నుండి ప్రేరణ పొందిన పెళ్లి ఆభరణాలు, బెంగాల్ కళలతో ప్రేరణ పొందిన సున్నితమైన ఆభరణాలు ఉన్నాయి.

భారతమంతా వ్యాపించే సంప్రదాయాలు:
ఈ కనెక్షన్‌కు మరింత ప్రత్యేకతనిచ్చేది దాని పాన్–ఇండియా యాక్సెసిబిలిటీ. దేశ వ్యాప్తంగా ఉన్న ఏ వధువు అయినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ శైలి నగలను అయినా ఎంచుకోవచ్చు. చెన్నైలో ఉండే వధువు రాజస్థానీ పోల్కీ హారాన్ని ఎంచుకోవచ్చు. అదే విధంగా ఢిల్లీలోని వధువు దక్షిణాది దేవాలయ ఆభరణాలను ఎంచుకోవచ్చు. మలబార్ యొక్క విస్తృతమైన డిజైన్ ఆర్కైవ్ మరియు కస్టమైజేషన్ నైపుణ్యానికి నిదర్శనం.

మలబార్ సిగ్నేచర్ బ్రైడల్ లైన్లను కొన్నింటిని కలిపి 2025 ఎడిషన్ తీసుకువస్తుంది. వాటిలో భారతీయ వారసత్వం, ఆలయ కళ నుండి ప్రేరణ పొందిన డివైన్ కలెక్షన్, రూబీస్ ఎమరాల్డ్స్, సఫైర్ వంటి రత్నాలతో సమృద్ధిగా ఉన్న ప్రీసియా కలెక్షన్, సాంప్రదాయ మూలాలతో భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని తీసుకోబడిన మోటిఫ్లతో ప్రకాశవంతమైన వజ్రాలను మిళితం చేసే సమకాలీన డైమండ్ కలెక్షన్ ఉన్నాయి. భారతీయ వధువుల గుర్తింపునకు ఈ సేకరణలు స్పష్టమైన చిత్రానికి అద్దంపడతాయి. గత 15 సంవత్సరాలుగా బ్రైడ్స్ ఆఫ్ ఇండియా నిర్మించిన గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తాయి.

వివాహ ఆభరణాల శ్రేణిలోని ప్రతి ఆభరణాన్ని మలబార్ గోల్డ్ & డైమండ్స్ నైపుణ్యం కలిగిన కళాకారులు డిజైన్ చేసి రూపొందించారు. వధువు సంస్కృతి, వధువు ఆచారాలు, వధువు తన వివాహానికి సంబంధించిన శుభ క్షణాలను గౌరవించే ఆభరణాలను మాత్రమే ప్రత్యేకంగా రూపొందిస్తారు.

కొన్ని గొప్ప వేడుకల ద్వారా, మరికొన్ని మరింత సన్నిహిత ఆచారాల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా తరతరాలుగా వస్తున్న ప్రతి వధువు సంప్రదాయాలను ప్రత్యేకంగా గౌరవిస్తుంది. ఆచారాలు మారినా వారసత్వంతో సంబంధం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఈ వైవిధ్యాన్ని గౌరవించేలా మలబార్ ఆభరణాలు రూపొందించబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వధువు బలం, తేజస్సు, కాలాతీత అందాన్ని ఈ ఆభరణాలు ప్రతిబింబిస్తాయి.

ఎన్టీఆర్ మాట్లాడుతూ, గొప్ప వైభవాన్ని మరియు భావోద్వేగాలను తెలుగు వివాహాలు ఒకచోట చేర్చుతాయి. గుడి గంటలు, బంగారు ఆభరణాల గొప్పతనం మరియు ప్రతి చిన్న విషయానికి కుటుంబాలు ఇచ్చే గౌరవం ఇవన్నీ పెళ్ళికి ప్రతిరూపం. వారి సొంత శైలిని రూపొందించుకుంటూ, మన వధువులు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తారు. సాంప్రదాయ వారసత్వ డిజైన్ల నుంచి ఆధునిక అభిరుచుల వరకు, మన మూలాలను కాపాడుతూనే, ఈ కలయికను ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’ అద్భుతంగా చూపిస్తుంది’ అని అన్నారు.

కార్తీ మాట్లాడుతూ, ‘ఒక తమిళ వధువుతో, ఆభరణాలు వాటి స్వంత భాషను మాట్లాడుతాయి. ఆలయ నమూనాల నుండి సాంప్రదాయ బంగారు ఆభరణాల వరకు ప్రతి డిజైన్‌కు ఒక ఉద్దేశ్యం మరియు చరిత్ర ఉంటుంది. తమిళ హస్తకళ ఆత్మను అందంగా తీర్చిదిద్దుతుంది ‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’, అదే సమయంలో మన వధువులు వేడుకలు జరుపుకుంటూ, తమ వ్యక్తిత్వాన్ని ఆ వారసత్వంలో వ్యక్తపరుస్తారు’ అని తెలిపారు.

‘బ్రైడ్స్ ఆఫ్ ఇండియా’ 15వ ఎడిషన్‌తో, మలబార్ గోల్డ్ & డైమండ్స్ భారతదేశంలో అగ్రగామి వన్-స్టాప్ బ్రైడల్ డెస్టినేషన్గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. బంగారం, వజ్రాలు, ప్లాటినం, రత్నాభరణాలతో సంస్కృతికి అద్దంపడుతూ సమకాలీన డిజైన్లను అందిస్తోంది. తమ డిజైన్ గొప్పతనంతో, సాంస్కృతిక మూలాలకు అనుసంధానమైన నైపుణ్యంతో, ప్రతి కుటుంబం కోసం శుభప్రదమైన, స్వంతమైన ఆభరణాలను మలబార్ అందిస్తోంది. వారి వారసత్వం, వారి గుర్తింపు ముందుకు తీసుకెళ్లాలనుకునే జ్ఞాపకాలను ప్రతిబింబించే ఆభరణాలను ఎంచుకునేందుకు, మలబార్ గోల్డ్ & డైమండ్స్ వధువులను ఆహ్వానిస్తుంది.