Deepika Padukone : దీపికా పదుకొనే కెరీర్ లో మరో ఘనత
దీపికా పదుకొనే 2025 లూయిస్ విట్టన్ ప్రైజ్‌లో మొదటి భారతీయ జ్యూరీగా ఎంపిక కావడం తన కెరీర్‌లో మరో ఘనత.

విధాత : గ్లోబల్ ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందిన బాలీవుడ్(Bollywood) టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) మరో అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. లూయిస్ విట్టన్(Louis Vuitton) ప్రైజ్ 2025కి మొదటి భారతీయ జ్యూరీ సభ్యురాలిగా దీపికా పదుకొనే ఎంపికైంది. ఇప్పటికే ఆమె లూయిస్ విట్టన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తుంది. లూయిస్ విట్టన్(Louis Vuitton) జ్యూరీలో దీపికా స్టైలిష్ లుక్ లో కనిపించింది. బంగారు రంగు అంచు గల మినీ స్కర్ట్, చిక్ షర్ట్ తో జతచేయబడి ఆమె ఈ అవార్డుకు మొదటి భారతీయ జ్యూరర్ గా నిలిచింది. ఇప్పటికే కేన్స్, మెగా గాలా వంటి ప్రపంచ ఫ్యాషన్ వేదికపై తనదైన స్టైలిష్ లుక్ తో అదరగొట్టిన దీపిక తాజాగా లూయిస్ విట్టన్ జ్యూరీ ప్రైజ్ 2025 కూడా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చింది.
మినీ స్కర్ట్ గోల్డెన్ కు తోడుగా ఇయర్స్ స్టడ్స్ గోల్డెన్ ధరించి దానికి మినిమల్ మేకప్ తో ఎంతో అందంగా క్లాసిక్ లుక్ లో హ్యాండ్ బ్యాగ్ ధరించి ఫోజులు ఇచ్చింది. చాలా మోడ్రన్‌గా బీచ్ వద్ద ఆమె రాయల్ లుక్ లో కనిపించింది. ఈ బాలీవుడ్ భామ 39 ఏళ్ల వయసులో కూడా అద్భుతంగా కనిపిస్తుంది. దీపికా పదుకొనే(Deeepika Padukone) ఇటీవలే తన కూతురుకు దువాకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో అందరిని ఆకర్షిస్తున్నాయి. ఆమె ఫోటోలను చూసిన భర్త రణవీర్ సింగ్(Ranveer Singh) కూడా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ‘హాట్ మామ్’ అంటూ కామెంట్ కూడా పెట్టారు. దీపికా పదుకొనే కూడా ‘కంగ్రాట్యులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్’ ట్యాగ్‌లైన్ పెట్టింది.