తాను ఏ పార్టీలోకీ మారడం లేదని, బీఆర్‌ఎస్‌లోనే ఉంటానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తనకు బీఆర్‌ఎస్ కార్యకర్త రక్తంతో రాసిన లేఖపై ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నానని భావించి ఆ కార్యకర్త రక్తంతో లేఖ రాయడం నాకు ఎంతో బాధ అనిపించిందన్నారు. ఆ లేఖలో అతను అడ్రస్ రాయలేదని, అతను ఎవరో కనుక్కొని తప్పకుండా ఇంటికెళ్లి కలుస్తానని తెలిపారు.
బోయిన్‌పల్లిలో జరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మల్లారెడ్డి.. తాను ఏ పార్టీలోకీ మారడం లేదని, బీఆర్‌ఎస్‌లోనే ఉంటానని మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్ ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని, 125ఏళ్లు బతకాలని, ప్రతిపక్ష నేతగా కేటీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన, ప్రజాసమస్యలపైన బాగా పోరాడుతున్నారని మల్లారెడ్డి కితాబునిచ్చారు. కేటీఆర్ తెలంగాణకు సీఎం కావాలని ఆకాంక్షించారు.
పార్టీ మార్పు అంశంపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి
తనకు పార్టీ మారే ఆలోచన లేదని..బిఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
మేడ్చల్ నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ కార్యకర్త రక్తంతో రాసిన లేఖ విషయంపై చాలా బాధపడుతున్నానన్న మల్లారెడ్డి
చిరునామా… pic.twitter.com/YaNjbP8YzH
— Telangana365 (@Telangana365) July 24, 2026
