Mallikarjun Kharge | కాంగ్రెస్ కిసాన్ న్యాయ్‌కు కట్టుబడి ఉంది: మల్లిఖార్జున్ ఖర్గే
తెలంగాణాలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో 2లక్షల రైతు రుణమాఫీపై చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే స్పష్టం చేశారు

సీఎం రేవంత్ నిర్ణయం హర్షనీయం
ట్విటర్ వేదికగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే
విధాత : తెలంగాణాలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో 2లక్షల రైతు రుణమాఫీపై చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. శనివారం ఆయన తెలంగాణ ప్రభుత్వ తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయంపై ట్విటర్ వేదికగా హర్షం వ్యకం చేస్తూ, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. రైతులపై ప్రధాని ప్రభుత్వం నల్ల చట్టాలను విధిస్తే.. కాంగ్రెస్ కిసాన్ న్యాయ్‌కు కట్టుబడి ఉందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. తెలంగాణాలోని 40 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేశారు.
तेलंगाना के 40 लाख से ज़्यादा किसान परिवारों को कांग्रेस की राज्य सरकार ने क़र्ज़ मुक्त बनाने का ऐतिहासिक निर्णय लिया है।
16 साल पहले, कांग्रेस-UPA सरकार ने 3.73 करोड़ किसानों का ₹72,000 करोड़ कृषि ऋण व ब्याज़ माफ़ किया था। उसके बाद हमने कई कांग्रेस शासित राज्यों में किसानों…
— Mallikarjun Kharge (@kharge) June 22, 2024
16 సంవత్సరాల క్రితం, కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం 3.73 కోట్ల మంది రైతులకు సంబంధించిన రూ.72 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, వాటి వడ్డీలను మాఫీ చేసిందని, ఆ తర్వాత అనేక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల రుణాలను మాఫీ చేశామని గుర్తుచేశారు. ఒకవైపు మోదీ ప్రభుత్వం దేశంలోని రైతులపై మూడు నల్ల చట్టాలను విధించి, ముళ్ల తీగలు, డ్రోన్ల నుండి టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, లారీ దెబ్బలతో నెలల తరబడి వేధిస్తే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ “కిసాన్ న్యాయ్” కింద సరసమైన ధరలు, రుణమాఫీ కమిషన్, బీమా చెల్లింపుల ప్రత్యక్ష బదిలీ, న్యాయమైన వ్యవసాయ దిగుమతి- ఎగుమతి పాలసీకి హామీ ఇచ్చిందని తెలిపారు. మా ఈ ఎజెండా చెక్కుచెదరకుండా ఉంటుందని ఖర్గే స్పష్టం చేశారు.