మంథని బీఆర్‌ఎస్‌లో చేరికలు

విధాత ప్రతినిధి, పెద్దపల్లి: మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి పలువురు నాయకులు బీఆర్ఎస్‌లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. శనివారం కమన్ పూర్ మండలకేంద్రానికి చెందిన తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుక్క చంద్రమౌళి గులాబీ గూటికి చేరారు. ఆయనకు మంథని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.