నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం ఆరుగురు మృతి
నాంపల్లి బజార్ ఘట్ లో అపార్ట్మెంట్లోని సెల్లార్ లో ఉన్న కార్ షెడ్ లో చెలరేగిన మంటలతో సంభవించిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

విధాత: నాంపల్లి బజార్ ఘట్ లో అపార్ట్మెంట్లోని సెల్లార్ లో ఉన్న కార్ షెడ్ లో చెలరేగిన మంటలతో సంభవించిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కారు రిపేర్ చేస్తుండగా డీజిల్ డబ్బాలకు మంటలు అంటుకుని మొదట గ్రౌండ్ ఫ్లోర్లో కు వ్యాపించి అపార్ట్మెంట్ అంతా విస్తరించాయి. ఉదయం 9:30కు ప్రమాదం జరిగింది.
కాగా.. ఐదు అంతస్తులకు వ్యాపించిన మంటలలో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వారిలో కొందరు సజీవ దహనం అవ్వగా మరికొందరు ఊపిరాడక మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. డిఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది 15 మందిని రక్షించారు. అపార్ట్మెంట్లో 27 మంది నివాసం ఉంటున్నారు.