Nampally : నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురి మృతదేహాల వెలికితీత

హైదరాబాద్ నాంపల్లిలో ఫర్నిచర్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల సహా ఐదుగురు మృతి చెందారు. భారీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.

Nampally : నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురి మృతదేహాల వెలికితీత

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లోని నాంపల్లి లో ఓ ఫర్నిచర్ గోదాం భవనంలో నెలకొన్న అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది ఆదివారం వెలికి తీశారు. ఇద్దరు చిన్నారుల సహా ఐదుగురి మృత దేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ప్రణీత్(7), అఖిల్(11), బేబీ(43), ఇంతియాజ్(32),హబీబ్(35)ల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

హైడ్రా, పోలీసులు, ఫైర్‌ విభాగాలకు చెందిన 200 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగడం గమనార్హం. జేసీబీ సహాయంతో గ్రౌండ్ నుంచి సెల్లార్ కి డ్రిల్లింగ్ తో రంధ్రం తవ్వి సెల్లార్ లోకి వెళ్లిన రెస్క్యూ బృందం మృతదేహాలను బయటకు తీసుకరాగలిగారు. ప్రమాదానికి కారణమైన నాంపల్లి బచ్చస్ ఫర్నిచర్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి :

Petrol | ఒక చోట పెట్రోల్ లీటర్ రూ.2కే ఇస్తున్నారు. ఎందుకో తెలుసా?
OTT Fight | ప్రపంచ ఓటీటీ రంగంలో పెరుగుతున్న హీట్ .. నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి ఛాలెంజ్‌గా జియో హాట్‌స్టార్!