ONGC Gas Leak : ఏపీలో ఓఎన్జీజీ గ్యాస్ లీక్..భారీగా ఎగిసిపడుతున్న మంటలు

కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో భారీ మంటలు చెలరేగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ONGC Gas Leak : ఏపీలో ఓఎన్జీజీ గ్యాస్ లీక్..భారీగా ఎగిసిపడుతున్న మంటలు

అమరావతి : ఏపీలోని డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్‌ సైట్‌ నుంచి గ్యాస్‌ లీకైంది. మలికిపురం మండలం ఇరుసుమండలో సుమారు 2 గంటలుగా గ్యాస్‌ పైకి ఎగ చిమ్ముతోంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ ఉన్నతాధికారులు, ఆ సంస్థ సాంకేతిక నిపుణులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఇరుసుమండలో ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, అధికారులతో మాట్లాడి సంఘటనపై ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. జిల్లా అధికారులు, ఓఎన్జీసీ ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రులకు, అధికారులకు సీఎం సూచించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని సూచించారు. తక్షణమే మంటలు అదుపులోకి తెచ్చేలా చూడాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Chandrababu : నది జలాలపై వివాదంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kavitha resignation| నా రాజీనామా ఆమోదించండి : కన్నీటితో కవిత వినతి