Minister Konda Surekha | వరంగల్‌లో ఘనంగా బీరన్న బోనాలు.. పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

వరంగల్‌లో బీరన్న బోనాల ఉత్సవం కన్నులపండువగా సాగింది. ఆశడమాసం ఆరంభం కావడంతో బుధవారం తమ ఇలవేల్పు బీరన్నకు తొలిబోనం కురుమ కులస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు.

Minister Konda Surekha | వరంగల్‌లో ఘనంగా బీరన్న బోనాలు.. పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

కన్నుల పండుగ ఉత్సవాలు

విధాత, వరంగల్ ప్రతినిధి : వరంగల్‌లో బీరన్న బోనాల ఉత్సవం కన్నులపండువగా సాగింది. ఆశడమాసం ఆరంభం కావడంతో బుధవారం తమ ఇలవేల్పు బీరన్నకు తొలిబోనం కురుమ కులస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. తొలి ఏకాదశి తొలి బోనం బీరన్న దేవుడికి సమర్పించడం కురుమ కులస్తుల ప్రత్యేకత. డోలు వాయిద్యాల మధ్య బోనం ఎత్తుకొని భారీగా మహిళలు తరలివచ్చారు. బీరన్నదేవుడికి ఇష్టమైన వంటలతో తయారుచేసిన బోనం కుండలను డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య వినూత్న నృత్యాల మధ్య మహిళలు తలపై పెట్టుకుని బీరన్న స్వామి ఆలయం వరకు వరుస పద్ధతిలో రావడం ఆకర్షణీయంగా ఉంటుంది.

బీరన్న స్వామి బోనాల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ నగరంలోని బీరన్న స్వామి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. బోనం ఎత్తుకొని పోచమ్మ దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ నగర ప్రజలందరికీ బీరన్న బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ పోచమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు నగర ప్రజలందరి పై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.