KTR Vs Ponguleti : హిల్ట్ పై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్
హిల్ట్ (HILT) పాలసీ భూముల వెనక్కి తీసుకుంటామని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. "రూ.101 కోట్లకు నియోపోలీస్ భూమితో సహా మీరు అమ్మినవాటిని మేం వెనక్కి తీసుకుంటున్నామా? మీలా కొనుగోలుదారులను భయపెట్టడం లేదు" అన్నారు.
విధాత, హైదరాబాద్ : హిల్ట్ పాలసీ కింద వేలంలో కొన్న భూములను వెనెక్కి తీసుకుంటామని, భూముల కన్వెర్షన్ రద్దు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఈ రెండు పాలసీలను పదేళ్లుగా అమలు చేశారని పొంగులేటి గుర్తు చేశారు. రూ.101కోట్లకు అమ్మిన నియోపోలీస్ భూమి సహా వేల ఎకరాల భూములను కేటీఆర్ హయాంలో అమ్మకం సాగించారని, ఓఆర్ఆర్ అమ్మారని గుర్తు చేశారు. ఇప్పుడు మేం వాటిని ఎక్కడా వెనక్కి తెస్తామని చెప్పలేదని..అలా చెప్పి కొనుగోలు దారులను భయపెట్టలేదన్నారు. మీరు చేసినవన్నీ మేము వెనక్కి తీసుకుంటున్నామా? నోటికొచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు అని.. మా ప్రభుత్వం మీలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించబోదని పొంగులేటి స్పష్టం చేశారు.
మీరు చేసిన కన్వేర్షన్ల సంగతేమిటో..
బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఎల్బీనగర్ లో సిరీస్ కంపెనీ భూములు కన్వెర్షన్ చేసింది ఎవరు? అని పొంగులేటి ప్రశ్నించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ భూములను రెసిడెన్షియల్ జోన్ గా కన్వర్షన్ చేశారని గుర్తు చేశారు. అలా ఐడీపీఎల్ సహా పలుచోట్ల ఉన్న ఆనాటి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, బినామీల కంపెనీల భూములను కన్వెర్షన్ చేసిన సంగతి మరువరాదన్నారు. మీరు అక్రమంగా కన్వెర్షన్ చేసిన ప్రతి గజం వివరాలు బయటపెడతాం అన్నారు. వాటన్నింటిని మేం రద్దు చేస్తామనో.వెనక్కి తీసుకుంటామనో మీలా మేం బెదిరించడం లేదన్నారు. మీలా ఇష్టం వచ్చినట్లుగా మేం చేయలేమని..మీది ప్రాంతీయ పార్టీ కావునా..నీవు, మీ నాయన, కుటుంబం కూర్చుని సెటిల్మెంట్లు చేసుకుంటారని..మాది జాతీయ పార్టీ అని..మేం మీ మాదిరిగా చేయలేమని, అంతా ధైర్యం మాకు లేదని కేటీఆర్ కు చురకలేశారు. నోరుంది కదా అని..మీరు చేశారని..మేం కూడా చేస్తామన్న భ్రమలతో.. మాటిమాటికి రూ.5లక్షల కోట్ల స్కామ్ అంటూ తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజమని పొంగులేటి మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి :
KTR Vs Ponguleti : హిల్ట్ పై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్
Indigo : ఇండిగో ఫ్లైట్ల రద్దు..ప్రయాణికుల ఆగమాగం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram