Minister Ponnam | కళ్ల మంటతోనే సీఎం విదేశీ పర్యటనపై బీఆరెస్ విమర్శలు: మంత్రి పొన్నం ప్రభాకర్
విదేశీ పర్యటన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం ప్రయత్నాలతో రాష్ట్రం ఎక్కడ బాడుగపడుతుందోనన్న కళ్లమంటతో ఓర్వలేక అసహనంతో బీఆరెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

రుణమాఫీ అందని రైతుల వివరాల సేకరణ
విధాత, హైదరాబాద్ : విదేశీ పర్యటన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం ప్రయత్నాలతో రాష్ట్రం ఎక్కడ బాడుగపడుతుందోనన్న కళ్లమంటతో ఓర్వలేక అసహనంతో బీఆరెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనురులో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాటు ఫాం హౌస్ నుంచి కనీసం సెక్రటేరియట్‌కు రాకుండా రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఈరోజు దేశం ఎల్లలు దాటి తెలంగాణ ప్రజల బాగు కోసం ప్రజా పాలన పేరు మీద బాగు చేయాలని ఆలోచనతో పనిచేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో విదేశీ పెట్టుబడుల సాధనకు రేవంత్ బృందం గట్టి ప్రయత్నాలు చేస్తుందన్నారు. సీఎం పర్యటనలో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక అంశాలు ముందడుగు పడుతుంటే కుటుంబపరమైన అంశాలు ప్రస్తావిస్తూ దానిని చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ అనేక సందర్భాల్లో విదేశీ పర్యటనలు చేశారని, కేసీఆర్ సీఎం స్థాయిలో ఉండి ఏనాడూ నిధులు తీసుకురావాలనే ఆలోచన చేయలేదన్నారు. వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి సీఎం రేవంత్ పర్యటనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.
సుంకిశాల పంప్‌హౌజ్ గోడ కూలిపోయిన ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. బీఆరెస్ చేపట్టిన ఈ ప్రాజెక్టు కూలిపోవడానికి ఆ పార్టీనే బాధ్యత వహించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు హైదారాబాద్ ఇంచార్జి మంత్రిగా నీళ్ళు హైదారాబాద్ కి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా మున్సిపల్, హెచ్‌ఎండీఏ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను పూర్తిగా విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటు అందరు చూసిందేనన్నారు. రైతు రుణమాఫీ అందని రైతుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. రైతులందరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.