Ponnam Prabhakar : బీఆర్ఎస్, బీజేపీలు ఎందుకు ఇంప్లీడ్ కాలేదు
బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్‌ఎస్, బీజేపీలు ఎందుకు ఇంప్లీడ్ కాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 09(విధాత): హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వం తరుపున బలమైన వాదనలు వినిపించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ లు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి , డెడికేటెడ్ కమిషన్ వేసి ,సబ్ కమిటీ వేసి కేబినెట్ ఆమోదించి ,శాసన సభలో చట్టం చేసి గవర్నర్ కి పంపడం జరిగిందన్నారు. 2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేశామన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదన్నారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ అని అన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రకటించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram