Seethakka: BJP, BRS గొంతుకులై మాట్లాడుతున్నడు.. తీన్మార్ మల్లన్నపై మంత్రి సీతక్క ఫైర్!

  • By: sr |    telangana |    Published on : Mar 05, 2025 4:21 PM IST
Seethakka: BJP, BRS గొంతుకులై మాట్లాడుతున్నడు.. తీన్మార్ మల్లన్నపై మంత్రి సీతక్క ఫైర్!

విధాత, వెబ్ డెస్క్: కులగణన(Caste Census)పై ఇటీవల తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)చేసిన విమర్శలపై మంత్రి సీతక్క(Minister Seethakka) ఫైర్ అయ్యారు. తీన్మార్ మల్లన్న లాంటి వారు బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకులై మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కులగణన తప్పుల తడక అని తాను నిరూపిస్తానన్న మల్లన్న వ్యాఖ్యలపై సీతక్క స్పందిస్తూ శాసన మండలి సమావేశాలలో ఆయన ఆ విషయాలను ఎత్తి చూపవచ్చన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు చేయలేని కులగణన కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తే అభినందించాల్సింది పోయి విమర్శలా అంటూ మల్లన్న విమర్శలను ఖండించారు.

పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో తనకో న్యాయం..రాహుల్ గాంధీకి, కోమటిరెడ్డికి ఓ న్యాయమా అంటూ మల్లన్న మాట్లడటాన్ని సీతక్క ఎద్దేవా చేశారు. తన గురించి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని..రాహుల్ గాంధీతో పోల్చుకునే స్థాయికి మల్లన్నకు లేదని స్పష్టం చేశారు.