Minister Seethakka | ఎంత గగ్గోలు పెట్టినా.. పరీక్షలను వాయిదా వేయం: మంత్రి సీతక్క

ప్రతిపక్షాలు ఎంత గ‌గ్గోలు పెట్టినా ప‌రీక్ష‌లు వాయిదా వేయ‌బోమ‌ని మంత్రి సీత‌క్క స్ప‌ష్టం చేశారు. షెడ్యుల్ ప్ర‌కారమే అన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని ఆమె పేర్కొన్నారు

Minister Seethakka | ఎంత గగ్గోలు పెట్టినా.. పరీక్షలను వాయిదా వేయం: మంత్రి సీతక్క

విధాత, హైదరాబాద్ : ప్రతిపక్షాలు ఎంత గ‌గ్గోలు పెట్టినా ప‌రీక్ష‌లు వాయిదా వేయ‌బోమ‌ని మంత్రి సీత‌క్క స్ప‌ష్టం చేశారు. షెడ్యుల్ ప్ర‌కారమే అన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని ఆమె పేర్కొన్నారు. వాయిదా వేస్తే న్యాయ ప‌ర‌మైన, సాంకేతిక ప‌ర‌మైన చిక్కులు ఎదుర్కొక త‌ప్ప‌ద‌న్నారు. . వయో ప‌రిమితి దాటిపోయి ఉద్యోగాల‌కు అర్హులు కాకుండా పోతారని, స్వప్రయోజనాల కోసమే కొందరు ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని డిమాండ్ చేస్తున్నారన్నారు.

రాష్ట్ర విశాల ప్ర‌యోజ‌నాల దృష్టిలో పరీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొందని ఆమె పేర్కొన్నారు. అధికారం కోల్పోయి రాజ‌కీయ నిరుద్యోగులుగా మారిన కొంద‌రు ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని నిరుద్యోగుల‌ను రెచ్చగొట్ట‌డం మానుకోవాలని హితవు పలికారు. పరీక్షల షెడ్యూల్ మ‌ధ్య‌లో ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల జీవితాల‌తో ఆడుకోవ‌డం న్యాయం అనిపించుకోదన్నారు. ప‌రీక్ష‌లు వాయిదా ప‌డుతాయ‌న్న భ్ర‌మ‌లు క‌ల్పించి నిరుద్యోగుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లొద్ద‌ని సీత‌క్క కోరారు.