విత్తనాల కొరత ప్రతిపక్షాల దుష్ప్రచారమే: మంత్రి తుమ్మల

రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత ఉందనేది అవాస్తవమని అదంతా ప్రభుత్వంపై కావాలనే ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కోన్నారు.

విత్తనాల కొరత ప్రతిపక్షాల దుష్ప్రచారమే: మంత్రి తుమ్మల

విధాత, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత ఉందనేది అవాస్తవమని అదంతా ప్రభుత్వంపై కావాలనే ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కోన్నారు. బుధవారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా క్యూలో చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అసలు అదిలాబాద్‌లో రైతులపై లాఠీచార్జ్ జరుగలేదని, ఒకే బ్రాండ్‌కు చెందిన విత్తనాలు కావాలని రైతులు పోటీపడటంతో ఇబ్బంది ఏర్పడిందని చెప్పారు.

రుణమాఫీ విషయంలో ఆర్బీఐతో చర్చిస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. రైతులు డిమాండ్ ఉన్న పంటల సాగు చేయాలని, వాతావరణం, మార్కెటింగ్‌, డిమాండ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని, అలాగే మంచి నాణ్యమైన విత్తనాలు వాడాలన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.