Mega Job Mela At Huzurnagar | మంత్రి ఉత్తమ్ మెగా జాబ్ మేళా

నల్లగొండ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఈ నెల 25న హుజూర్ నగర్‌లో మెగా జాబ్ మేళా. 150 ప్రైవేట్ సంస్థలు పాల్గొని 5,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి.

Mega Job Mela At Huzurnagar | మంత్రి ఉత్తమ్ మెగా జాబ్ మేళా

విధాత : నల్లగొండ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తమ నియోజకవర్గ అభివృద్ధి, రాజకీయాలు..ప్రజాసేవ కార్యక్రమాలలోనే కాకుండా జాబ్ మేళాల నిర్వహణలోనూ పోటీ పడుతున్నారు. గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ పేరుతో పలు మెగాజాబ్ మేళాలు నిర్వహించారు. తద్వార వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగవకాశాలు కల్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహణకు సిద్దమయ్యారు.

మంత్రి ఉత్తమ్ సారధ్యంలో ఈ నెల 25న హుజూర్ నగర్ పట్టణంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాలో 150 ప్రైవేట్ సంస్థలు ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నాయి. దాదాపు 5వేల మందికి పైగా ఈ మేళాలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, పీజీ, ఫార్మసీ విద్యార్హత ఉండి..18నుంచి 40ఏళ్ల వయోపరిమితికి లోబడిన నిరుద్యోగులు ఈ మెగా జాబ్ మేళాకు హాజరుకావచ్చని తెలిపారు.