Minister Uttam Kumar Reddy | అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడుతా: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని, మఠంపల్లి మండలాన్ని అగ్రగామిగా నిలిచే విధంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్ర నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు

Minister Uttam Kumar Reddy | అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడుతా: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వ సహకారంతో మౌలిక వసతులు
బక్కమంతుల గూడెంలో 2.5 కోట్లతో నిర్మించే 33/11 కె వి విద్యుత్ ఉప కేంద్రానికి శంఖుస్థాపన

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని, మఠంపల్లి మండలాన్ని అగ్రగామిగా నిలిచే విధంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్ర నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెం లో 2.5 కోట్లతో నిర్మించే 33/11 కె వి విద్యుత్ ఉప కేంద్రానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ విద్యుత్ ఉపకేంద్రం కోసం ప్రజలు, రైతులు పెట్టుకున్న దశాబ్ధకాలపు కల నెరవేరిందన్నారు.

సుల్తానపూర్ తండా వద్ద ఎన్‌సీఎల్‌, చెన్నాయి పాలెం సబ్ స్టేషన్ ల పనులు కూడా త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే నా దృష్టికి తేవాలని అధికారులకు ఉత్తమ్‌ సూచించారు. 80 కోట్లతో 10 మీటర్ల వెడల్పు తో హుజుర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు, 10 కోట్లతో చౌటపల్లి నుండి మేళ్లచెర్వు వరకు, 17 కోట్లతో మట్టంపల్లి నుండి జానపహాడ్ రోడ్ మార్గంలో వర్ధపురం, రాఘవాపురం వద్ద రెండు బ్రిడ్జ్ లు,అలాగే 11.5 కోట్లతో చెన్నాయి పాలెం వద్ద బ్రిడ్జి నిర్మించటం జరుగుతుందని త్వరలో పనులు ప్రారంభం చేయటం జరుగుతుందని తెలిపారు. అమరవరం, పెద్దవీడు లిప్ట్ ఇరిగేషన్ లకి మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తేవటం జరిగిందని,మరింత ఆయకట్టును పెంచటానికి ఏమైనా లిప్ట్ ఇరిగేషన్ లు అవసరం ఉంటే మంజూరు చేస్తానని మంత్రి ఈ సందర్బంగా తెలిపారు.

రైతులకోసం 24 గంటల నాణ్యమైన విద్యుత్ ని అందిస్తున్నామని, అలాగే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు వాడుకున్న వారికి జీరో బిల్లు వస్తుందని, మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచితంగా ఆర్ టి సి బస్సు లలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని,500 రూపాయలకే గ్యాస్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, హుజూర్‌నగర్ ఆర్డీవో ఓ శ్రీనివాస్, జడ్పీ సీఈవో వి. అప్పారావు, టీఎస్పీడీసీఎల్ ఎస్ఈ. సిహెచ్ పాల్ రాజ్, డిఈలు వెంకట కృష్ణయ్య, డాలి నాయుడు, ఈఈ కృష్ణ రెడ్డి, తహశీల్దార్ మంగ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.