Jagadish Reddy | కార్యకర్తలకు ధీమా.. బీఆరెస్ సభ్యత్వ బీమా: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
కార్యకర్తల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న బీఆరెస్ పార్టీ సభ్యత్వ బీమాతో కొండంత అండగా నిలుస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.

కార్యకర్తల కుటుంబాలకు సభ్యత్వ బీమా చెక్కులు అందజేత
Jagadish Reddy | కార్యకర్తల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న బీఆరెస్ (BRS) పార్టీ సభ్యత్వ బీమాతో కొండంత అండగా నిలుస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఇటీవల మరణించిన బీఆరెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి పార్టీ సభ్యత్వ బీమా చెక్కులను ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత కుటుంబ సభ్యులకు అందజేసి మాట్లాడారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలవాలనే లక్ష్యంతో బీఆరెస్ అధినేత కేసీఆర్ (KCR) తీసుకున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకమే అన్నారు. పోరాడి సాధించిన తెలంగాణలో అధికారంలో ఉన్న పదేండ్లు అన్ని రంగాల అభివృద్ధితో పాటు తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు.
అన్ని రంగాల అభివృద్ధితోపాటు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో కేసీఆర్ కు మరెవరు సాటిరారన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన అనసూయకు, అక్కరదేవి గూడెం గ్రామానికి చెందిన పుట్ట సుజాత, లక్ష్మి, రాయిని గూడెం గ్రామానికి చెందిన నరేష్ లకు పార్టీ సభ్యత్వ బీమాకు సంబంధించిన ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మర్ల చంద్రారెడ్డి, తూడి నరసింహారావు, జూలకంటి సుధాకర్ రెడ్డి, జూలకంటి జీవన్ రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.