MLA Kota Prabhakar Reddy | పంచాయతీలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యం చేస్తుండటంతో ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లు, పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని దుబ్బాక బీఆరెస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.

MLA Kota Prabhakar Reddy | పంచాయతీలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శలు

విధాత, హైదరాబాద్‌ : కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యం చేస్తుండటంతో ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లు, పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని దుబ్బాక బీఆరెస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. పల్లెల్లో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. దుబ్బాక పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు 400మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటివరకు రైతులకు కాలువల ద్వారా నీరు ఇచ్చిన పాపాన పోలేదని, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయనీయకుండా అడ్డుపడటంతో చెక్కులు వెనక్కి వెళ్లిపోయాయని ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ఏ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లినా నయాపైసా విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు.