కారు నడిపిన ఎమ్మెల్సీ కవిత
నిన్న స్కూటీ ఎక్కి..నేరు కారు నడిపి..ఎన్నికల ప్రచారంలో బీఆరెస్ ఎమ్మెల్సీ కదనోత్సహం చాటారు.నిజామాబాద్ అర్భన్ బీఆరెస్ అభ్యర్థి గణేష్ గుప్తా నామినేషన్ కార్యక్రమంలో కవిత స్వయంగా కారు నడిపి కార్యకర్తల్లో జోష్ నింపారు.

విధాత : సీఎం కేసీఆర్ కూతురు, బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ తరుపునా తనవంతు ఎన్నికల ప్రచార బాధ్యతల నిర్వాహిస్తు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న బోథన్ బీఆరెస్ అభ్యర్థి షకీల్ నామినేషన్ సందర్భంగా కార్యకర్త స్కూటీపై ప్రయాణించారు కవిత. శుక్రవారం నిజామాబాద్ అర్బన్ బీఆరెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గుప్తా నామినేషన్ కార్యక్రమంలో స్వయంగా కారు నడిపి కార్యకర్తలతో జోష్ నింపారు. బీఆరెస్ పార్టీ ఎన్నికల గుర్తు నమూనాగా తయారు చేసిన అంబాసిడర్ కారును కవిత అభ్యర్థి నివాసం నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు నడిపారు. ఆమె కారు వెనుక పార్టీ శ్రేణులు బైక్‌లు, కార్లతో భారీగా ర్యాలీగా సాగారు