MLC Takella | మానుకోటకు అన్యాయం జరిగితే ఊరుకోం : ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి
మహబూబాబాద్ కు వచ్చిన రైల్వే మెగా మెయింటనెన్స్ డిపో ప్రాజెక్ట్ వెనక్కి తీసుకుపోయే కుట్ర జరుగుతుంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు నిదురపోతున్నారా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ప్రశ్నించారు.
విధాత, వరంగల్ :
మహబూబాబాద్ కు వచ్చిన రైల్వే మెగా మెయింటనెన్స్ డిపో ప్రాజెక్ట్ వెనక్కి తీసుకుపోయే కుట్ర జరుగుతుంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు నిదురపోతున్నారా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ప్రశ్నించారు. మహబూబాబాద్ లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మానుకోట కు మంజూరైన భారీ రైల్వే ప్రాజెక్టును తరలించే పనిలో ఉంటే.. ఇక్కడి ఎంపీ, ఎమ్మెల్యే ఏం…చేస్తున్నట్లు అని తక్కెళ్లపల్లి నిలదీశారు. మానుకోట చరిత్ర తెలుసు కదా..తిరుగుబాటు ప్రారంభం కాక ముందే మీ మౌనం వీడండంటూ హితవు పలికారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించే రైల్వే మెగా మెయింటనెన్స్ డిపో ప్రాజెక్టు పనులను మహబూబాబాద్ లో వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. మానుకోట అభివృద్ధి కోసం, ప్రాజెక్టుల మంజూరు కోసం, మన ప్రజల సంక్షేమం కోసం, భవిష్యత్ తరాల బాగుకోసం అందరం ఆలోచించాలన్నారు. అంతే తప్పా వచ్చిన భారీ ప్రాజెక్టులు కూడా వలసపోతుంటే మీరు మౌనంగా ఉండగలరేమోగానీ.. మేము మాత్రం సహించలేమని స్పష్టం చేశారు. ప్రాజెక్టు తరలింపునకు అడ్డుగా నిలబడుతామని, ప్రజలను సమీకరిస్తామని తెలిపారు. మానుకోట అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలబడుతామని ఎమ్మెల్సీ రవిందర్ రావు స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram