New Wolf Snake | కొత్త తోడేలు పాము గురించి విన్నారా? గ్రేట్ నికోబార్ దీవిలో గ్రేట్ డిస్కవరీ!
జీవ వైవిధ్యానికి ప్రఖ్యాతిగాంచిన గ్రేట్ నికోబార్ దీవిలో ఒక అరుదైన సర్పం శాస్త్రవేత్తలకు దర్శనమిచ్చింది. తోడులు పాము (వూల్ఫ్ స్నేక్)జాతికి చెందిన కొత్త రకం పాముగా దీనిని గుర్తించారు.
New Wolf Snake | ఆసక్తిగొలిపే జీవుల్లో పాములు ప్రథమ స్థానంలో ఉంటాయి. అవి జెర్రిగొడ్డులు కావచ్చు.. కింగ్ కోబ్రాలు కావచ్చు.. కొండచిలువలు కావచ్చు! ఏదైనా ఒక వింతే. ఎన్నిసార్లు చూసినా విడ్డూరమే. కొన్ని కొన్ని ప్రాంతాలు కొన్ని రకాల సర్పాలకు నిలయాలుగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో తప్ప కనిపించని పాములూ ఉంటాయి. ఒక్కోసారి మునుపెన్నడూ చూడని, లేదా అరుదైన పాము జాతులు అనుకోకుండా తారసపడుతూ ఉంటాయి. ఇలాంటిదే ఒక అరుదైన పాము తొలిసారిగా గ్రేట్ నికోబార్ దీవిలో కనిపించింది.
గ్రేట్ నికోబార్ దీవి అనేది అండమాన్ నికోబార్ దీవుల్లో భాగం. అండమాన్ నికోబార్ దీవుల్లో దక్షిణం వైపు చివరిలో ఉంటుంది. సుమత్రా ద్వీపానికి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ దీవిలో జనాభా సుమారు 8వేలు ఉంటుంది. ఎక్కువగా ట్రాపికల్ ఫారెస్ట్‌తో నిండి ఉండే ఈ దీవి వైవిధ్య భరితమైన వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రసిద్ధికి మరో ప్రత్యేకత ఇప్పుడు కలిగింది. ఇక్కడ ఒక ప్రత్యేక సర్పం కనిపించింది.
వూల్ఫ్ స్నేక్ జాతికి చెందిన ఈ కొత్త పాము.. నల్లగా నిగనిగలాడుతూ సన్నటి శరీరంతో ఉన్నది. దీనికి శాస్త్రవేత్తలు లైకోడాన్ ఇర్వినీ అని నామకరణం చేశారు. నికోబార్ దీవుల్లో ఇంకా అధ్యయనం చేయాల్సిన జీవవైవిధ్యాన్ని ఈ కొత్త పాము నొక్కి చెబుతున్నది. లైకోడాన్ ఇర్వినీని కనుగొన్న తర్వాత శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఇప్పటి వరకూ తెలిసిన వూల్ఫ్ స్నేక్స్‌లో కనిపించని అరుదైన లక్షణాలను దీనిలో గమనించారు. అత్యంత అరుదుగా కనిపించడం, దాని గురించి పెద్దగా సమాచారం లేకపోవడం ఇది అసాధారణమైన పాముగా నిలుపుతున్నది. నికోబార్ దీవిలో అధ్యయనం చేయాల్సిన, కనుగొనాల్సిన, కాపాడవలసిన జీవ జాతులు ఇంకా ఎన్నో ఉన్నాయని తాజా ఆవిష్కరణ పేర్కొంటున్నది.
తొలిసారి వూల్ఫ్‌స్నేక్‌కు సంబంధించిన ఒకే ఒక నమూనా 2010 నమోదు చేశారు. తాజాగా కనిపించిన పాము, మరో పాము నమూనాతో దానిని సరిపోల్చారు. అయితే.. గతంలో కనిపించిన వూల్ప్ స్నేక్స్‌లో లేని వైవిధ్యాలను ఈ కొత్త పాములో గుర్తించారు. పొలుసుల పొందిక, శరీరతత్వం, దాని ఛాయ.. అన్నీ భిన్నంగా ఉన్నాయి. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణపై తీవ్రంగా కృషి చేసిన స్టీవ్ ఇర్విన్, ఆయన బృందానికి గౌరవం ఇస్తూ కొత్త జాతికి లైకోడాన్ ఇర్వినీ అని నామకరణం చేశారు.
కొత్తగా కనిపించిన వూల్ఫ్ స్నేక్.. సుమారు 1.2 మీటర్ల పొడవు ఉంది. సన్నటి, నల్లని శరీరం, చిన్న తోక కారణంగా దీనిని సులభంగా గుర్తించవచ్చు. ఇప్పటి వరకూ ఇలాంటి పాములు నాలుగు సందర్భాల్లోనే కంటపడ్డాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ జాతి పాములు మొత్తంగా గ్రేట్ నికోబార్ దీవిలోనే ఉన్నాయి. ఈ పాములు అరుదుగా ఉన్న నేపథ్యంలో వీటి సంరక్షణ అనేది సవాలుగా మారింది. దీనిని అంతరించిపోతున్న జాతి జాబితాలో చేర్చారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం ఎవల్యూషనరీ సిస్టమాటిక్స్‌లో పబ్లిష్ అయింది.
ఇవి అస్సలు మిస్ అవ్వొద్దు :
Asian Water Snake | అసోం ‘జూ’లో అరుదైన పాము దర్శనం
High Speed Camera Snake Bites | స్లోమోషన్‌లో పాము కాటు వీడియోలు.. చూస్తే గుండెలు గుభేలే!
Kokapet Lands | ఎకరం రూ.137 కోట్లు.. కోకాపేటలో రికార్డు ధరలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram