Kokapet Lands | ఎకరం రూ.137 కోట్లు.. కోకాపేటలో రికార్డు ధరలు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కోకాపేట మరోసారి రికార్డు సృష్టించింది. తెలంగాణ సర్కార్ నిర్వహించిన భూముల ఈ-వేలంలో ప్లాట్లు అద్భుతమైన ధరలను నమోదు చేశాయి.
విధాత, హైదరాబాద్ :
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కోకాపేట మరోసారి రికార్డు సృష్టించింది. తెలంగాణ సర్కార్ నిర్వహించిన భూముల ఈ-వేలంలో ప్లాట్లు అద్భుతమైన ధరలను నమోదు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ వేలంలో ఎకరం రూ.137 కోట్లు పలికింది. కాగా, ఇటీవల కాలంలో ఇంత భారీగా ధర పలకడం ఇదే తొలిసారి.
కోకాపేటలోని ప్లాట్ నెంబర్లు 17, 18కు భారీ స్పందన లభించింది. ఈ వేలంలో ప్లాట్ నెంబర్ 17, 18 స్థలాలకు పెట్టుబడిదారుల నుంచి పెద్ద ఎత్తున బిడ్డింగ్ వచ్చింది. ఈ వేలంలో ప్లాట్ నెంబర్ 17 – 4.59 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 18 – 5.31 ఎకరాలు.. ఈ రెండు ప్లాట్లను కలిపి మొత్తం 9.9 ఎకరాలను వేలంలో నిలిపింది. మొత్తం బిడ్ లో ఈ 9.9 ఎకరాలకు పెట్టుబడిదారులు రూ.1355.33 కోట్లు వెచ్చించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కోకాపేటకు ఉన్న భారీ డిమాండ్‌ను మరోసారి రుజువు అయింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram