Women Kabaddi Worldcup |జయహో.. కబడ్డీ ప్రపంచకప్ విజేతగా భారత్
భారత మహిళల జట్టు మరో ప్రపంచకప్ సాధిందించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరిగిన ఈ మేగా టోర్నమెంట్ లో భారత్ జయకేతనం ఎగురవేసిది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచులో భారత్.. చైనీస్ తైపీని చిత్తు చేసింది.
భారత మహిళల జట్టు మరో ప్రపంచకప్ సాధిందించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరిగిన ఈ మేగా టోర్నమెంట్ లో భారత్ జయకేతనం ఎగురవేసిది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచులో భారత్.. చైనీస్ తైపీని చిత్తు చేసింది. 35-28 పాయింట్ల తేడాతో చైనీస్ తైపీనీ భారత్ మట్టికరిపించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఈ ఈవెంట్ లో మహిళల కబడ్డీ ప్రపంచకప్ ఛాంపియన్ గా భారత్ నిలిచింది.
ఢాకా వేదికగా జరిగిన సెమీఫైనల్ లో భారత్ జట్టు 33-21 పాయింట్ల తేడాతో ఇరాన్ ను చిత్తు చేసి ఫైనల్లోకి ప్రవేశించింది. మరో సెమీఫైనల్ లో బంగ్లాదేశ్ ను 25-18 పాయింట్ల తేడాతో ఓడించిన చైనీస్ తైపీ భారత్ తో పోటీపడింది. ఈ టోర్నిలో మొత్తం 11 జట్లు పాల్గొన్నాయి. గ్రూప్ ఏ లో భారత్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. కాగా, కొన్ని రోజుల వ్యవధిలోనే భారత మహిళలు వన్డే ప్రపంచకప్, అంధుల టీ20 వరల్డ్ కప్, కబడ్డీ ప్రపంచకప్ గెలవడం గర్వకారణం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram