Group 2 | గ్రూప్ 2 వాయిదాకు అవకాశం … హామీలను నిలబెట్టుకుంటామన్న ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి

ప్రభుత్వం గ్రూప్ 2పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలిస్తుందని, నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెలుతామని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లు హామీ ఇచ్చారు

Group 2 | గ్రూప్ 2 వాయిదాకు అవకాశం … హామీలను నిలబెట్టుకుంటామన్న ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి

విధాత, హైదరాబాద్ : ప్రభుత్వం గ్రూప్ 2పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలిస్తుందని, నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెలుతామని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లు హామీ ఇచ్చారు. గురువారం గ్రూప్ 2వాయిదా అంశంపైన, ఇతర నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం తరుపునా చామల, బల్మూరిలు చరణ్ కౌశిక్, లోకేశ్ యాదవ్, బలాలక్ష్మి, చెనగాని దయాకర్లతో కలిసి నిరుద్యోగులతో టూరిజం ప్లాజాలో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం చామల, బల్మూరిలు మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులు చెప్పిన సమస్యలు విన్నామని, పరిష్కరించే విధంగా సీఎం దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పారు. నిరుద్యోగులు కోరుకునే విధంగా సానుకూలమైన ప్రకటన వచ్చే విధంగా కృషి చేస్తామని, ముఖ్యంగా డీఎస్సీ -గ్రూప్ 2 పరీక్షకి మధ్య తక్కువ వ్యవధి ఉందని, ఇది కూడా ఉదేశపూర్వకంగా ఇచ్చిన డేట్స్ కాదన్నారు. నిరుద్యోగుల కోరిక మేరకే అ రోజు టెట్ నిర్వహించామని,
ఐతే అప్పటికే టీజి పీఎస్సీ పరీక్షలకు డేట్స్ ఇవ్వడంతో డీఎస్సీ -గ్రూప్ 2 పరీక్షలు వారం వ్యవధిలోనే వచ్చాయన్నారు. గ్రూప్ 2పరీక్ష వాయిదా న్యాయమైన డిమాండ్ కాబట్టి..సమస్యను సీఏం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. గ్రూప్ 2 పరీక్షలపై ఇక సానుకూలమైన ప్రకటన వచ్చేలా చూస్తామన్నారు. ఇక మిగతా సమస్యలు కూడా నిరుద్యోగులు మా దృష్టికి తీసుకొచ్చారని వెల్లడించారు. రానున్న రోజులో ఎలాంటి సమస్యలు రాకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాలలో 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తితో, బీజేపీ నాయకులతో చర్చించి నిరుద్యోగులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.
అసెంబ్లీలో అందరి ముందు కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధి చాటుకునే విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని భర్తీ చేసి నిరుద్యోగుల పట్ల ఉన్న ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకుంటామన్నారు. గత బీఆరెస్‌ ప్రభుత్వం లాగా నిరుద్యోగులను మోసం చేయమని స్పష్టం చేశారు.