Mynampally Hanumanth Rao | హరీశ్‌రావుకు మైనంపల్లి సవాల్.. రాజీనామా చేయాలని డిమాండ్
సిద్ధిపేట సెంటర్‌లో కాంగ్రెస్, బీఆరెస్ పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. బీఆరెస్ రుణమాఫీ సమస్యపై సమావేశం నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ సంబర సభను నిర్వహించింది

ఉప ఎన్నికల్లో ఇద్దరం పోటీ చెద్దాం
మళ్లీ హరీశ్‌రావు గెలిస్తే భవిష్యత్తులో నేను ఎన్నికల్లో పోటీ చేయను
Mynampally Hanumanth Rao | సిద్ధిపేట (Siddipet) సెంటర్‌లో కాంగ్రెస్, బీఆరెస్ పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. బీఆరెస్ రుణమాఫీ (Runa mafi) సమస్యపై సమావేశం నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ సంబర సభను నిర్వహించింది. కాంగ్రెస్ సభకు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) చెప్పినట్లుగా ఆగస్టు 15తేదీ నాటికి రుణమాఫీ చేశారని, హరీశ్‌రావు (Harish Rao) చేసిన సవాల్ మేరకు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేట ఉప ఎన్నికల్లో ఇధ్దరం పోటీ చేద్దామని, మళ్లీ హరీశ్‌రావు గెలిస్తే నేను భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయబోనని, నా సవాల్‌కు హరీశ్‌రావు ముందుకు రావాలని కోరారు. నీకు మైనంపల్లి పీడ పోవాలంటే రాజీనామా చేసి నాతో ఎన్నికల్లో తలపడాలన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మైనంపల్లి లేదా హరీశ్‌రావు ఒక్కరే ఉండాలన్నారు