Nagalingam Pushpam | ఈ భూమ్మీద అనేక రకాల పుష్పాలు( Flowers ) ఉన్నాయి… కానీ మానవజాతికి తెలిసిన పువ్వులు కొన్ని మాత్రమే. మల్లె, గులాబీ, బంతి, చామంతి, కమలం వంటి పుష్పాలను నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ పుష్ఫాన్ని మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. ఎందుకంటే ఈ పుష్పం.. పుష్పాల్లోకెల్లా అరుదైన పుష్పం. చాలా తక్కువగా కనిపిస్తుంది కూడా. మరి అలాంటి పుష్పం.. కరీంనగర్ ఉజ్వల పార్కులో ప్రత్యక్షమైంది. మరి ఆ పుష్పం పేరేంటంటే.. నాగలింగం పుష్పం( Nagalingam Pushpam ).
నాగలింగం పుష్పం ఇతర పుష్పాల మాదిరిగా ఎక్కడంటే అక్కడ కనిపించదు. అరుదుగా కనిపిస్తుంది. తాజాగా కరీంనగర్ ఉజ్వల పార్కు( Karimnagar Ujwala Park )లో ఈ పుష్పం విరబూసింది. సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చెట్టు పండ్లు పెద్దగా ఉండి, ఫిరంగి గుండ్ల మాదిరి ఉంటాయి. ఈ నాగలింగం పుష్పాల మధ్యలో శివలింగం ఆకారం ఉండి.. దానిపై పాము పడగ విప్పినట్లుగా ఉంటుంది. అందుకే ఈ పువ్వును నాగలింకం లేదా మల్లికార్జున పువ్వు అని పిలుస్తారని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ నాగలింగం పుష్పం రాత్రి వేళ పరిమళాన్ని వెదజల్లుతుండడంతో స్థానికులు ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ నాగలింగం చెట్టును ఇంగ్లీష్ భాషలో ‘కానన్ బాల్ ట్రీ’( cannon ball tree ) అని పిలుస్తారు. శాస్త్రీయ నామం వచ్చేసి కౌరోపిటా గుయానిన్‌సిస్( couroupita guianensis ).
