Minister Sureka | మంత్రి సురేఖపై కేసు విత్‌డ్రా చేసుకున్న నాగార్జున
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన రూ.100 కోట్ల పరువునష్టం కేసును ఆయన వెనక్కి తీసుకున్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడంతో నాగార్జున తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
విధాత, హైదరాబాద్ :
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువునష్టం కేసును ఆయన వెనక్కి తీసుకున్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడంతో నాగార్జున తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలపై నాగార్జున రూ.100 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో నాగార్జున, కొండా సురేఖ ఇద్దరూ పలుమార్లు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గురువారం నాంపల్లి కోర్టులో ఈ కేసు విచారణ డిసెంబర్ 9కి వాయిదా పడింది. అయితే, మంత్రి కొండా సురేఖ చేసిన క్షమాపణల నేపథ్యంలో హీరో నాగార్జున తన పరువునష్టం దావాను వెనక్కి తీసుకున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram