Kaleshwaram | కాళేశ్వరం పంప్‌హౌజ్‌లు ఆన్ చేసిన ప్రభుత్వం.. మా విజయమేనంటూ బీఆరెస్ ప్రచారం
రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మోటార్లను ఆన్ చేసి గోదావరి నీళ్లను లిఫ్టు చేసే ప్రక్రియ శనివారం ప్రారంభించింది. నంది మేడారం పంప్ హౌస్‌లో మూడు మోటార్లు, గాయత్రి పంప్ హౌస్‌లో ఒక మోటార్‌ను ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేస్తోంది.

నంది మేడారం, గాయత్రి పంప్‌హౌజ్ మోటార్లతో లిఫ్టింగ్
విధాత, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మోటార్లను ఆన్ చేసి గోదావరి నీళ్లను లిఫ్టు చేసే ప్రక్రియ శనివారం ప్రారంభించింది. నంది మేడారం పంప్ హౌస్‌లో మూడు మోటార్లు, గాయత్రి పంప్ హౌస్‌లో ఒక మోటార్‌ను ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేస్తోంది. శుక్రవారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం నుంచి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తామని చెప్పారు. ఎల్‌ఎండీ, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లను పంపిస్తామని చెప్పారు.
ఈ మేరకు పంప్‌లను ఆన్ చేశారు. అయితే అదే రోజు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడిగడ్డను సందర్శించి ఆగస్టు 2 లోగా కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లివ్వాలని, లేదంటే మేమే 50వేల మందితో వచ్చి పంప్‌లను ఆన్ చేస్తామని అల్టిమేటమ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం లిఫ్టు మోటార్లను ఆన్ చేసి నీటిని పంపింగ్ చేస్తుండటంతో ఇదంతా మా ఘనతేనంటూ, మా డెడ్‌లైన్‌కు ప్రభుత్వం తలొగ్గిందంటూ బీఆరెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేపట్టింది.