Nalgonda Auto Accident | ఆటో పల్టీ..ముగ్గురు మృతి
నల్లగొండ చింతపల్లి హైవే పై ఆటో పల్టీ, ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి, మరొకరికి స్వల్ప గాయాలు.
విధాత : నల్లగొండ జిల్లా చింతపల్లి మండంల నరసర్ల పల్లి వద్ధ హైదరాబాద్ నాగార్జునసాగర్ హైవే పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుండి దేవరకొండకు నలుగురు యువకులు ఆటోలో వస్తుండగా చింతపల్లి మండలం నరసర్ల పల్లి వద్ద ఒక్కసారిగా ఆటో పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. కాగా మరొక యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన యువకుడిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న యువకులు దేవరకొండ మండలం వడ్త్యా తండా కు చెందిన వారీగా గుర్తించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram